Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా ఇంటిలో ఇలా చేస్తే ముఖం తెల్లగా అందంగా మెరిసిపోవటం ఖాయం…
Curd And Lemon Beauty Tips in telugu :వాతావరణ కాలుష్యం కారణంగా ముఖం మీద మురికి,మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో ముఖం నల్లగా,నిస్తేజంగా మారిపోయి కాంతివిహీనంగా కనపడుతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ముఖం తెల్లగా,కాంతివంతంగా కనపడుతుంది. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ని ఉపయోగిస్తున్నాం. ఇవి మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.
మొదటి ఇంగ్రిడియన్ గోధుమపిండి
గోధుమపిండిలో ఉండే బ్లీచింగ్ గుణాలు,పోషకాలు చర్మాన్ని సహజంగా బ్లీచ్ చేయటంలో సహాయపడతాయి. ఇది ముఖం మీద నలుపును,మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
రెండో ఇంగ్రిడియన్ పెరుగు
పెరుగు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది.పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలను, నలుపును తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.
మూడో ఇంగ్రిడియన్ నిమ్మకాయ
నిమ్మరసాన్ని ముఖానికి రాస్తే నలుపు, డల్ నెస్ తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.నిమ్మరసంలో ఉండే విటమిన్ సి,సిట్రిక్ ఆమ్లంముఖాన్ని తెల్లగా మారుస్తాయి.
ఇప్పుడు ప్యాక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకోని దానిలో ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి. మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ముఖానికి రాసే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ముఖానికి ప్యాక్ వేశాక రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ప్యాక్ ఆరాక సాదారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖం నిస్తేజంగా కనిపించినప్పుడు లేదా బయటకు వెళ్ళే ముందు వేసుకుంటే ముఖం తాజాగా,కాంతివంతంగా కనపడుతుంది. ముఖం మీద పెరుకుపోయిన మృతకణాలు,నలుపు తొలగిపోతాయి.
చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. పార్టీ లేదా ఫంక్షన్ వెళ్ళేటనికి అరగంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్ తో పనిలేకుండా ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరిసిపోతుంది.