DevotionalToday Rasi Phalalu In telugu

Vasantha panchami 2024:వసంత పంచమి నుండి దశ తిరిగి కుబేరులు కాబోతున్న రాశులు… మీ రాశి ఉందేమో?

Vasantha panchami 2024:ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 14 బుదవారం రోజు వచ్చింది. చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టిన రోజును వసంత పంచమిగా జరుపుకుంటాం. మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిధి రోజును శ్రీ పంచమి లేదా వసంత పంచమిగా జరుపుకుంటాం. ఈ వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారికి తెల్లని పూలతో పూజ చేసి తెల్లటి రంగు ప్రసాదాలను నైవేద్యంగా పెడితే అమ్మవారి కృప కలిగి కోరుకున్న కోరికలు తీరతాయి.

వసంత పంచమి రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అమ్మవారి పుట్టిన రోజు అయినా వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాబ్యాసం చేస్తే ఆ చదువుల తల్లి కృపతో చదువు బాగా వస్తుందని నమ్మకం. ఈ రోజు వసంత పంచమి నుండి మూడు రాశుల వారికి దశ తిరిగి కుబేరులు కాబోతున్నారు. ఈ పంచమి నుండి ఈ రాశుల వారి గ్రహ స్థితులు కారణంగా అన్ని రకాలుగానూ కలిసి వస్తుంది. ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి వారి గ్రహ స్థితి కారణంగా ఈ వసంత పంచమి నుండి వారు చేసే ప్రతి పనిలోనూ బాగా కలిసి వస్తుంది. ప్రతి పని విజయవంతం అవుతుంది. ఈ రాశివారికి రావలసిన బకాయిలు తొందరగా చేతికి అందుతాయి. శుభవార్తలు వింటారు.

కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకువెళతారు. ఈ రాశివారికి ప్రతి సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. వీరు ప్రయత్నం చేయటం ఆలస్యం ప్రతి పని పూర్తి అవుతుంది. ఈ రాశివారు కొంచెం కష్టపడితే చాలు అన్ని పనులు పూర్తీ అవుతాయి.

సింహ రాశి
సింహ రాశివారికి వారి గ్రహ స్థితి కారణంగా ఈ వసంత పంచమి నుండి వారు చేసే ప్రతి పని సానుకూలంగా ఉంటుంది. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు,గౌరవ మర్యాదలు వస్తాయి. వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.

ఈ రాశివారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి స్నేహితులు అవుతారు. ఈ రాశివారు ఏ పనిని అయినా చాలా సులభంగా చేసేస్తారు. వీరు చేసే ప్రతి పనికి స్నేహితుల సహకారం ఉంటుంది. వీరు జీవితం పట్ల సానుకూల దృక్పధంతో ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని అసంతృప్తులు ఈ వసంత పంచమి నుండి తొలగిపోతాయి.

కుంభ రాశి
కుంభ రాశివారికి వారి గ్రహ స్థితి కారణంగా ఈ వసంత పంచమి నుండి ప్రతి పని సానుకూలంగా జరుగుతాయి. ఇప్పటివరకు ఉన్న ఆందోళన,టెన్షన్స్ అన్ని ఈ వసంత పంచమి నుండి తొలగిపోతాయి. వీరికి ప్రతి విషయంలోనూ స్పష్టత వస్తుంది.

అలాగే చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. వీరికి ఆర్ధికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో అసలు లోటు ఉండదు. కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి అందరు సంతోషంగా ఉంటారు. ప్రతి పనిని అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు . కుంభ రాశివారు ఈ వసంత పంచమి నుండి చాలా ఆనందంగా గడుపుతూ ఉత్తమమైన ఫలితాలను పొందుతారు.