Kandi Podi:రుచికరమైన కంది పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫన్స్,రైస్ లోకీ ఎంత బావుంటుందో..
Kandi Podi Recipe: వేడి వేడి అన్నం, ఇడ్లీ,దోశ,గారే, ఏ వంటకం లోకైనా, కాసింత కండి పొడి యాడ్ చేసుకుంటే, ఆ రుచే వేరు. ఆంధ్రులు ఎంతో ఇష్టపడే, కందిపొడి ఎలా చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
కందిపప్పు – 1/2కప్పు
శనగపప్పు – 1/2కప్పు
పెసరపప్పు – 1/2కప్పు
మినపప్పు – 1/4కప్పు
ఎండుమిర్చి – 50 గ్రాములు
జీలకర్ర – 2 టేబుల్ స్పూన్స్
సొంటి – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, ఒకోక్క పప్పు వేసి, సన్నని మంటపై, దోరగా వేపుకోవాలి.
2. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేపి పెట్టుకోవాలి.
3. జీలకర్రను కూడా వేపుకోవాలి.
4.ఇప్పుడు మిక్సీ జార్ లోకి, మిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసి, మిగిలిన పప్పులు, సొంటి వేసుకుని, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పోసి పెట్టుకుంటే 2 నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
Click Here To Follow Chaipakodi On Google News

