MoviesTollywood news in telugu

Actors costumes:సినిమాల్లో నటుల బట్టలు ”మురికి” గా కనపడాలంటే ఏం చేస్తారు…?

Actors costumes techniques:తెలుగు సినిమా అంటేనే రిచ్ నెస్ బాగా కనపడుతుంది. ఈ రిచ్ నెస్ పిచ్చి ఎంతవరకు ఉంటుందంటే హీరో కూలీ అయినా బ్రాండెడ్ షర్ట్స్ వాడతాడు. తినటానికి తిండి లేకపోయినా ఇంటి వాతావరణంలో రిచ్ నెస్ కి కొదవ ఉండదు. ఆలా అలవాటు అయిన తెలుగు సినిమాకి మాత్రం భిన్నమైన సినిమా రంగస్థలం.

ఈ సినిమా చూసినంత సేపు తెరపై పాత్రలే కనపడతాయి. కానీ నటీనటులు కనపడరు. హీరో,హీరోయిన్స్ మాత్రమే కాకుండా సినిమాలో అన్ని పాత్రలు అలానే ఉంటాయి. ఇక ఇంటి పరిసరాలు వారు వాడే వస్తువులు అన్ని పాతగా పల్లెటూరులో ఎలా ఉంటాయో అలానే కనిస్తాయి.

ఇలా కనిపించే ఈ సినిమా తెలుగువారికి కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి. ఇలాంటి తరహా ఎక్కువగా తమిళ సినిమాల్లో కన్పిస్తుంది. ఇటీవల కాలంలో చూస్తే ఇటువంటి తీరు రంగస్థలంలో కన్పిస్తుంది.

రామ్ చరణ్,సమంతా లాంటి స్టార్స్ కాస్ట్యూమ్స్ కూడా మురికి మురికిగా కనిపిస్తూ వారు పోషించిన పాత్రకు తగ్గట్టుగా ఉంటాయి. బట్టలు ఇలా మురికిగా కనపడటానికి ఏమి చేసారో సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

సినిమాకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ఉండాలని చాలా బలంగా అనుకున్నాం. సినిమాలో హీరో,హీరోయినే కాకుండా మొత్తం పాత్రధారులు అందరు మురికిగా ఉన్న బట్టలను వేసుకొని కనపడతారు.

ఆ బట్టలు ఆలా రావటానికి టీ డికాషన్,కాఫీ లలో ముంచి తీసేవాళ్లమని హీరో,హీరోయిన్ ఇలా ఎవరి కాస్ట్యూమ్స్ అయినా ఇలాగే చేసేవారమని సుకుమార్ చెప్పాడు. సుక్కు చెప్పినట్టుగా రామ్ చరణ్,సమంతా ఆ బట్టలను వేసుకున్నందుకు అభినందించాల్సిందే.