MoviesTollywood news in telugu

Allu Arjun:బన్నీ గంగోత్రి కన్నా ముందు ఎన్ని సినిమాలు చేసాడో తెలుసా ?

Allu Arjun Child Artist Movies:అల్లు వారబ్బాయి గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు అల్లు అర్జున్ ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ బన్నీ పుష్ప Part 2 పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. రష్మికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తండ్రి బడా ప్రొడ్యూసర్ అయినప్పటికీ తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ తొలిసినిమా గంగోత్రి తరవాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా లతో దూసుకెళ్తున్నాడు. అయితే బన్నీ గంగోత్రి కంటే ముందు డాడీ సినిమా లో కనిపించాడు. అయితే డాడీ సినిమా లో ఒక చిన్న డాన్సర్ గా కనిపించడం కంటే ముందు రెండు సినిమా లో బన్నీ బాలనటుడి గా కనిపించాడని చాలా మందికి తెలియదు.

అయితే 1985 లో వచ్చిన విజేత సినిమా లో మెగాస్టార్ మేనల్లుడి గా బన్నీ కనిపించాడు. ఇక ఆతరువాత 1986 లో కమల్ హాసన్, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో కూడా బన్నీ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు స్వాతిముత్యం లో కమల్ హాసన మనవళ్ళ లో ఒకడిగా ఒక చిన్న షాట్ లో కనిపించాడు.

ఆ విధంగా బన్నీ నేటి తరం యువ హీరోల కంటే ముందే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక గంగోత్రి కమర్షియల్ గా కొంత సక్సెస్ కాలేదు. అప్పట్లో బన్నీ నటన పై కొన్ని సెటైర్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత బన్నీ చేసిన సినిమా లు ఇండస్ట్రీ లో అతనికి క్రేజ్ తెచ్చాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."