Kitchen Tips:ఉల్లిపాయలు నెల రోజులు నిల్వ ఉండాలంటే…ఈ టిప్స్ ఫాలో అవ్వండి
How To Store Onion in telugu:ప్రతి రోజు ఉల్లిపాయలను ఎక్కువగానే వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ వంటలకు మంచి రుచిని అందిస్తుంది. ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే ఉల్లిపాయలను ఒక్కొక్కసారి ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటూ ఉంటాం. అవి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

ఉల్లిపాయలను నిల్వ చేసే ప్రదేశంలో తేమ,నీరు లేకుండా చూసుకోవాలి. తేమ ఎక్కువగా ఉంటే తొందరగా పాడైపోతాయి. తేమ లేని ప్రదేశంలో ఉల్లిపాయలను నిలువ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లిపాయలు కాగితం సంచులలో కూడా నిల్వ చేయవచ్చు. అయితే ఆ కాగితం సంచికి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.

ఉల్లిపాయలను వేడి పదేశంలో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. అలాగే ఉల్లిపాయలను వెదురు కంటైనర్ లో కూడా విలువ చేయవచ్చు. లేదంటే నెట్ బ్యాగులలో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఈ చిట్కాలను పాటిస్తే ఉల్లిపాయలు దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

