Beauty TipsHealth

Lip Care:పెదవులు నల్లగా ఉన్నాయా? – ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

Lip Care Tips In Telugu : మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మారుతున్న వాతావరణం, కాలుష్యం, డీహైడ్రేషన్, మితిమీరిన కెఫిన్, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వంటి కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి. చాలా మంది నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
lemon benefits
మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయిన పెద్దగా ప్రయోజనం కనపడదు. దాంతో చాలా విసుగు చెందుతారు. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ఎంత నల్లగా ఉన్నాసరే పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ వాడుతున్నాము. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
cold remedies
ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార, అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ vaseline వేసి బాగా కలపాలి. బాగా కలిసిన ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
vaseline
పంచదారలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని అల్ట్రావైలట్ రేస్ నుంచి పరిరక్షిస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువగా తగిలిన పెదాలు బాగా నల్లగా మారతాయి.టాక్సిన్ ల నుంచి చర్మాన్ని కాపాడే గ్లైసోలిక్ యాసిడ్ చక్కెరలో ఉంటుంది. కాబట్టి నల్లని పెదాలను గులాబీ రంగులోకి మారటానికి పంచదార బాగా సహాయపడుతుంది. నాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసే నిమ్మ పెదవులపై ఉన్న ముదురు రంగును పోగొడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.