Beauty Tips

Coffee face pack: కాఫీ పౌడర్‌తో ఇంట్లోనే ముఖం మెరిసేలా అద్భుతమైన ఫేస్ ప్యాక్…!

Coffee And Milk Face Pack: అందమైన మెరిసే ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖం మీద sun tan వచ్చిందంటే తొందరగా తగ్గదు. దాంతో చాలా మంది బ్యూటీపార్లర్ కి వెళ్ళి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయిన ఫలితం పెద్దగా ఉండదు. అలా కాకుండా ఇంటిలోనే చాలా తక్కువ ఖర్చులో ఈ సమస్య నుండి బయట పడి ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

దీని కోసం ముందుగా ముఖానికి స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ముఖానికి ప్యాక్ వేయాలి. స్క్రబ్ కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ గులాబీ రేకల పొడి, సరిపడా పాలను పోసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇక ఇప్పుడు ప్యాక్ వేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ లో బాగా పండిన అరటిపండులో సగంను మెత్తగా చేసుకొని వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పాలు పోసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత 5 గంటల వరకు సబ్భును ఉపయోగించకూడదు.

వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖం మీద sun tan, నల్లని మచ్చలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వంటివి అన్నీ తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో బ్యూటీపార్లర్ కి వెళ్లకుండా ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.