Beauty Tips

Flaxseed Hair Gel:జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు

Flaxseed Hair Gel:జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు..మారిన జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, జుట్టుకి సరైన పోషణ చేయకపోవటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతుంది.

మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారు పడుతూ ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు ఏమి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అందువల్ల సమయాన్ని వృదా చేయకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే తప్పనిసరిగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో రెండు స్పూన్ల మినపప్పును నాలుగు గంటలు నానబెట్టాలి. మరొక బౌల్ లో ఒక స్పూన్ అవిసె గింజలను రెండు గంటల పాటు నానబెట్టాలి. అవిసె గింజలను ఇలా నానబెట్టటం వలన జెల్ వస్తుంది.

నానిన మినపప్పును మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో రెండు స్పూన్ల అవిసె గింజల జెల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

మినపప్పు,అవిసె గింజలలో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను,చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చులో జుట్టు రాలే సమస్య నుండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.