Devotional

Maha shivratri 2024: శివుడికి అత్యంత ఇష్టమైన వీటిని సమర్పిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి

Maha shivratri 2024: శివుడికి అత్యంత ఇష్టమైన వీటిని సమర్పిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8 శుక్రు వారం రోజున వచ్చింది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో మహాశివ రాత్రి పర్వదినం ఒకటి.

శివరాత్రి పూజ శివ,శక్తి కలయికను సూచించటం వలన ఈ పండుగకు అంత ప్రత్యేకత ఉంది. శివుడు అభిషేక ప్రియుడు. శివునికి భక్తితో ఒక చెంబు నీటితో అభిషేకం చేసిన చాలు. అయన సంతృప్తి చెంది కోరిన వరాలుఇస్తారు . అయితే శివరాత్రి రోజున శివునికి వీటిని సమర్పిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయో తెలుస్కుందాం.

శివరాత్రి రోజున ఎవరి శక్తి కొలది వారు వెండి లేదా బంగారం కుందులో ఆవునెయ్యి వేసి దీపారాధన చేసి బ్రాహ్మణులకు దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది. అలాగే తోటకూర కట్టను దానం చేస్తే అంతులేని సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా శివరాత్రి రోజున శివునికి అత్యంత ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు శివునికి ఇష్టమైన పువ్వులు,పత్రాల గురించి తెలుసుకుంటూ,వాటితో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

మారేడు దళాలు శివునికి అత్యంత ఇష్టమైన పత్రాలు. ఈ పత్రాలను త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. శివుని పూజించటానికి ఒక్క మారేడు దళం చాలు.శివుడు భోళాశంకరుడు.ఆయనకు ఇష్టామైన ఒక్క బిళ్వపత్రంతో బికారులను కోటీ శ్వరులను చేయగల పూజ బిళ్వపత్రానికుంది. అందుకే శివరాత్రి వచ్చిందంటే అందరు మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తారు.

మారేడు దళానికి శివ అర్చనలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంచు మించు ప్రతి శివాలయంలోను మారేడు చెట్టు ఉంటుంది. మూడు మారేడు ఆకులను కలిపి దళం అంటారు.ఇవి శివుని మూడు కళ్ళకూ ప్రతీ కలు. శివుడు ఈ మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని చెప్తారు.ఇంత పవిత్రమైన మారేడు పత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల శివానునుగ్రహం లభిస్తుంది.

శంఖం పూలను కేవలం శివుని ఆరాధనే కోసమే ఉపయోగిస్తారు ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు తొందరగా ప్రసన్నం అవుతారని నమ్మకం. సంపెంగ పూల సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి. వీటితో పూజించేవారికి శివుడి కటాక్షం దొరకటమే కాకుండా ఎప్పుడు సంతోషంగా ఉంటారు.

జిల్లేడు పుష్పాలు వల్ల మనుషుల్లో ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. శివుడికి పూజించిన ఈ పూలను తలపై ధరిస్తే పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోయి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది.

పసుపు రంగులో ఉండే గన్నేరు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారు. పసుపు రంగు త్యాగానికి గుర్తుగా భావిస్తారు. అవసరాలను త్యాగం చేయడం వల్ల జీవితంలో ప్రతి అంశంలో సమతౌల్యత పాటించడం వీలువుతుంది.

మల్లెపూల సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాలు సానుకూలంగా మారుతాయి. వీటితో శివుడికి పూజ చేస్తే సంతోషం, మానసిక ప్రశాంతత కలుగుతుంది.

నాగమల్లి పుష్పం.. శివునికి అత్యంత ఇష్టమైన పుష్పం.. దీనితో శివుని పూజిస్తే త్వరగా అనుగ్రహం కలగటమే కాకుండా కోరిన కోరికలు కూడా త్వరగా తీరతాయి.

శివరాత్రి రోజు ఈ పూలతో శివునికి పూజ చేసి చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.