Beauty Tips

White Hair: తెల్ల జుట్టు భయపెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే నల్లని జుట్టు మీ సొంతం.

White Hair: తెల్ల జుట్టు భయపెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే నల్లని జుట్టు మీ సొంతం…మారిన జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం, పోషకాహార లోపం వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్య అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణం అయ్యిపోయింది.

వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య రావటంతో చాలా ఆందోళన పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే వాటిని వాడటం వలన కొన్ని సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి 50 ml ఆవనూనె పోయాలి. కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ కలోంజీ గింజల పొడి, ఒక స్పూన్ మెంతుల పొడి, స్పూనున్నర హెన్నా పొడి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని 5నుంచి 7 నిమిషాల వరకు మరిగించి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టుకి బాగా పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సహజసిద్దమైనవి.

కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగి స్తున్నారు. ఆవనూనె తెల్లజుట్టుకి కారణం అయిన సమస్యపై పోరాటం చేస్తుంది. మెలనిన్ స్థాయిలు పెంచి తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.