Beauty TipsHealth

Vitamin E capsule: జుట్టు రాలుతోందా? పెరగడం లేదా? విటమిన్ ఇ క్యాప్సూల్స్ అన్ని సమస్యలకు పరిష్కారం!

Vitamin E capsule Hair Fall Tips : ఈ మధ్యకాలంలో వాతావరణంలో మారిన మార్పులు, కల్తీ నూనెలు, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలను వాడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో తయారు చేసుకునే నూనె వాడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు ఆలివ్ నూనె, అరకప్పు ఆముదం, 4 విటమిన్ ఇ టాబ్లెట్స్ లోని నూనెను ఒక బౌల్ లో వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసి జుట్టు కుదుళ్ళకు పట్టేలాగా మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన కుదుళ్ళు గట్టిపడి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

అలాగే రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో పోషకాలు జుట్టు పెరగడానికి, ఆలివ్ నూనె లో ఉండే పోషకాలు జుట్టును తేమగా ఉంచడానికి సహాయపడతాయి. విటమిన్ ఇ ఆయిల్ జుట్టు రాలకుండా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఆముదం జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చాలు. ఈ నూనెను జుట్టుకి రాసిన తర్వాత అలా వదిలేయవచ్చు. లేదా రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయవచ్చు. ఆముదంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆముదం కాస్త జిడ్డుగా ఉంటుంది. అందువల్ల వాడటానికి చాలా మంది ఆసక్తి చూపరు. కానీ ఆముదం వాడితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.