Beauty Tips

Hair Loss tips Telugu : జుట్టు రాలే సమస్యకు ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే అంతా సెట్!

Hair Loss tips Telugu : జుట్టు రాలే సమస్యకు ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే అంతా సెట్.. ప్రతి ఒక్కరూ పొడవైన అందమైన జుట్టు కావాలని కోరుకుంటారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం అయిందంటే చాలా బాధ పడతారు. జుట్టు రాలకుండా ఉండటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి.ఈ రెమిడీ కోసం అవిసె గింజలను ఉపయోగిస్తున్నాం.ఒక పాన్ లో అరకప్పు అవిసె గింజలు వేస్తే రెండు కప్పుల నీటిని పోసి బాగా ఉడికించాలి.

ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆవిసే గింజలను ఉడికించేటప్పుడు గ్యాస్ మీడియంలో ఉంచాలి. నురుగుతో ఉండి తెల్లగా రావడం ప్రారంభమవుతుంది.ఆ నురుగు బాగా వచ్చే వరకు ఉడికించాలి. .

ఈ విధంగా నురుగు బాగా వచ్చాక టీ నెట్ ద్వారా వడకట్టాలి. జెల్ తయారవుతుంది ఈ జెల్ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. జుట్టుకి మంచి పోషణను అందిస్తుంది. రెండు స్పూన్ల జెల్ లో ఒక స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. జెల్ లో బాదం ఆయిల్ కలపటం వలన దీని శక్తి రెట్టింపు అవుతుంది.

ఈ జెల్ ని జుట్టు మూలాలకు బాగా పట్టించాలి. సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.ఈ జెల్ ని రెండు వారాలు వాడితే జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు .రాలే సమస్య తగ్గి పెరగడం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.