Beauty Tips

Skin Whitening Remedies: ముఖం కాంతివంతంగా, తెల్లగా ఉండాలంటే.. ఈ ప్యాక్స్‌ వేసేయండి..!

Skin Whitening Remedies: ముఖం కాంతివంతంగా, తెల్లగా ఉండాలంటే.. ఈ ప్యాక్స్‌ వేసేయండి.. ముఖం తెల్లగా,అందంగా ఉండాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా మనకు ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముడతలు,మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ అతి మధురం పొడి, అరస్పూన్ జాజికాయ పొడి,ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ గంధం పొడి, ఒక స్పూన్ multani mitti, అరస్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఈ పొడిని ఎక్కువగా తయారుచేసుకొని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఒక స్పూన్ పొడిలో రోజ్ వాటర్ పోసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకు రాసి పది నిమిషాలు అయ్యాక నీటిని ముఖం మీద జల్లుతు రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది.

చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని ముడతలు,మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ముఖం అందంగా ఉండటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.