DevotionalToday Rasi Phalalu In telugu

Telugu Rasi Phalalu:March 16 రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్త!

Telugu Rasi Phalalu:March 16 రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్త…జాతకాలను నమ్మే వారు ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకుంటారు. దాని ప్రకారం అడుగులు వేస్తారు. అయితే మనలో కొంతమంది జాతకాలను అసలు నమ్మరు.

మేషరాశి
ఈ రాశి వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండేలా చూసుకోవాలి.

వృషభ రాశి
ఈ రాశి వారు చేసే పని మీద ఏకాగ్రత ఉండేలా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది.

మిధున రాశి
ఈ రాశి వారు మనో ధైర్యంతో ముందడుగు వేయాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచనలు చేయాలి.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. అనవసర ఖర్చులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి
ఈ రాశి వారు అలసట లేకుండా చూసుకోవాలి. ఆలోచన పెట్టుబడిగా చేసి లాభాలను అందుకుంటారు. కలహాలకు చాలా దూరంగా ఉండాలి.

కన్య రాశి
ఈ రాశి వారు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మిశ్రమ ఫలితాలు వస్తాయి. వాదనల జోలికి అసలు వెళ్ళకూడదు.

తులారాశి
ఈ రాశి వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బంధు మిత్రులను కలుస్తారు. అధికారుల సహకారం ఉంటుంది.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనో ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కలహాలకు దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి
ఈ రాశి వారు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమ చాలా ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి.

మకర రాశి
ఈ రాశి వారు గమ్యం చేరేవరకు పట్టుదల విడవకుండా పనులను పూర్తి చేయాలి. ఎలాంటి సమస్య అయినా పరిష్కరిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

కుంభరాశి
ఈ రాశి వారు ఏ పని చేసిన ప్రయత్నం లోపం లేకుండా చేయాలి. ఈ రాశి వారి పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాలలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి
ఈ రాశి వారు చేసే పనులను చాలా సులువుగా పూర్తిచేస్తారు. విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతారు. ఈ రాశి వారి పనితీరుకు గుర్తింపు లభిస్తుంది.