Beauty Tips

Cracked Heels:ఇలా చేస్తే 2 రోజుల్లో పాదాల పగుళ్లు మాయం అవుతాయి….ఇది నిజం

Cracked Heels:ఇలా చేస్తే 2 రోజుల్లో పాదాల పగుళ్లు మాయం అవుతాయి….ఇది నిజం.. పగిలిన మడమలు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా, నొప్పిని కూడా కలుగ చేస్తుంటాయి. ఒక్కోసారి నొప్పి, బాధ ఎక్కువగా ఉంటాయి. పొడి చర్మం వలన పగిలిన మడమలు ఇతర చర్మ సమస్యలను కలిగిస్తాయి. అయితే వీటిని తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

పాదాలు పొడిగా ఉండటం మరియు ఒత్తిడికి గురవటం వలన పాదాలు పగుళ్ళకు లోనవుతాయి. సరైన విధంగా చికిత్స చేయకపోతే రక్త స్రావాలకు లోనవుతాయి. కావున వీలైనంత త్వరగా తగిన చికిత్సను అందించటం మంచిది.అశ్రద్ధ చేయకూడదు. పగిలిన మడిమలకు చాలా మంది, మార్కెట్ లో లభించే ఇంగ్లిష్ మందులను వాడతారు.

వీటి వలన ఫలితం ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది . ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్ధాలు అయితే వాటికీ సహజంగా తేమను అందించి శాశ్వతంగా తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ చిట్కాకు ఏమి అవసరం అవుతాయి అలాగే ఎలా తయారుచేసుకోవాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల కొబ్బరి పాలు, అరస్పూన్ తేనె, అరస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాశి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే క్రమంగా పాదాల పగుళ్లు అన్నీ మాయం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.