Beauty Tips

White hair Turn black:ఉల్లిపాయతో ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది

White hair turn Black: ఉల్లిపాయతో ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జుట్టుకి సంబందించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లగా మారిపోవటం వంటివి జరుగుతున్నాయి. తెల్లజుట్టు నల్లగా మారటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న పెద్దగా ప్రయోజనం కనపడదు.

అలాగే ఖరీదైన హెయిర్ ప్రోడక్ట్స్ వాడిన సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య మరియు తెల్లజుట్టు సమస్యను తగ్గించటానికి ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్పర్ అధికంగా ఉండుట వలన తలలో రక్త ప్రసరణ బాగా పెంచటమే కాకుండా జుట్టు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తుంది. దాంతో రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రీ గ్రోత్ అవటానికి సహాయపడుతుంది.

ఉల్లిపాయతో ఉండే లక్షణాలు జుట్టు పెరుగుదలలో సహాయపడి జుట్టు రాలకుండా కాపాడుతాయి. ఉల్లిపాయ జుట్టు రాలే సమస్యలకు తెల్ల జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఉల్లి పేస్ట్ జుట్టుకు ఉపయోగించటం వలన కళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది.

అందువల్ల ఇప్పుడు చెప్పే విధానం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో నీటిని పోసి ఉల్లిపాయ ముక్కలను వేసి స్టవ్ మీద పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఉపయోగించటం వలన జుట్టు రాలే సమస్య నుండి బయటపడటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

బాగా మరిగాక చల్లారనివ్వాలి. ఈ చల్లారిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వడకట్టాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా నీటిలో ఉడికించటం వలన ఉల్లిలో ఉన్న ఔషధ గుణాలు అన్ని నీటిలోకి చేరతాయి. ఈ ఉల్లిపాయ నీటిని తలస్నానము చేయటానికి అరగంట ముందు జుట్టుకు మరియు జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానము చేయండి.

ఈ విధంగా క్రమం తప్పకుండ వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య,తెల్ల జుట్టు సమస్య అలాగే జుట్టుకు సంబందించిన అన్ని రకాల సమస్యల నుండి బయట పడవచ్చు. ఉల్లిపాయ రసాన్ని ఈ విధంగా ఉపయోగించటం వలన జుట్టు రాలే సమస్య నుండి బయటపడటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నవారు వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.