Beauty Tips

Beauty Tips: ఈ మచ్చలకు బ్యూటీ క్రీమ్స్ వద్దు.. ఇలా చేస్తే ఇట్టే మాయం

Beauty Tips: ఈ మచ్చలకు బ్యూటీ క్రీమ్స్ వద్దు.. ఇలా చేస్తే ఇట్టే మాయం.. ముఖం అందంగా తెల్లగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా మందికి ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు వంటివి వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఫలితం సరిగా లేక నిరాశ పడుతూ ఉంటారు.

అలాంటి వారు ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. పెసలను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ పెసర పిండి, అరస్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. పెసలను పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. పెసలలో ఉండే విటమిన్ A, C… చర్మాన్ని కాపాడతాయి. అలాగే వీటిలోని ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు కూడా చర్మం కందిపోకుండా మృదువుగా ఉండేలా చేస్తాయి.

కలబందలో ఉన్న లక్షణాలు చర్మంలోతుల్లోకి చొచ్చుకెళ్లి మృతకణాలను తొలగిస్తాయి. చర్మం మెరిసేలా చేయటమే కాకుండా చర్మ ఎలాసిటీని పెంచుతుంది. ఈ ప్యాక్ చర్మానికి పోషణ అందించి చర్మం మీద మృతకణాలను తొలగించి ముఖం తెల్లగా మెరిసేలా కెఃస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.