Beauty Tips

Hair Care Tips: జుట్టు రాలకుండా పొడవుగా,ఒత్తుగా చేసే అద్భుతమైన టిప్

Hair Care Tips: జుట్టు రాలకుండా పొడవుగా,ఒత్తుగా చేసే అద్భుతమైన టిప్.. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొనుగోలు చేసి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా అసలు ఖర్చు పెట్టకుండా మన ఇంటి పెరటిలో ఉన్న మొక్కలతో తగ్గించుకోవచ్చు.

పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి దానిలో శుభ్రంగా కడిగిన 6 జామ ఆకులను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 3 మందార పువ్వులను రేకలుగా వీడదీసి వేయాలి. 5 నిమిషాల పాటు మరిగిస్తే జామ ఆకులు, మందరపువ్వులలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఆ నీటిని ఒక బౌల్ లోకి వడకట్టాలి.

ఈ నీటిలో అలోవెరా జెల్ వేసి బాగా కలిపి జుట్టుకి బాగా పట్టించాలి. అరగంట అయ్యాక రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు.

జామ ఆకులు,మందార పువ్వులు, అలోవెరా లలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరిగేలా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు కుదుళ్లు బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. తల మీద చర్మం తేమగా ఉండేలా చేసి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.