Lemon Peel:నిమ్మ తొక్కలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే…అసలు నమ్మలేరు
Lemon Peel:నిమ్మ తొక్కలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే…అసలు నమ్మలేరు.. మనం సాధారణంగా నిమ్మకాయలు చవకగా దొరికినప్పుడు ఎక్కువగా కొనేస్తూ ఉంటాం.
అలాంటప్పుడు నిమ్మకాయల నుండి రసాన్ని తీసి నిమ్మ తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ నిమ్మ తొక్కల్లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే అసలు పాడేయరు. నిమ్మ తొక్కలలో ఉన్న పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.
ఎముకల ఆరోగ్యానికి నిమ్మ తొక్కలు బాగా సహాయపడతాయి. నిమ్మ తొక్కలలో కాల్షియం మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు ఆరోగ్యంగా,బలంగా ఉండటానికి సహాయాపడుతుంది. ఆస్టియో ఫ్లోరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులను నివారించడంలో నిమ్మ తొక్కలు బాగా సహాయపడతాయి.
నిమ్మ తొక్కలలో శక్తివంతమైన సిట్రస్ బయో-ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాక శరీరంలో
విషాలను బయటకు పంపటంలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిమ్మ తొక్కలలో పాలీఫెనాల్ ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో కొలెస్ట్రాల్
స్థాయిలను తగ్గించడంలో సహాయం చేసి గుండెకు సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
నిమ్మ తొక్కలలో పొటాషియం ఉండటం వలన మన శరీరంలో సరైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటితో పాటు, గుండె జబ్బులు, గుండెపోటు మరియు డయాబెటిస్ నివారణకు కూడా నిమ్మ తొక్కలు సహాయపడతాయి. నోటి ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు నిమ్మ తొక్కలు బాగా సహాయాపడతాయి.విటమిన్ సి
లోపం కారణంగా చిగుళ్ళలో రక్తస్రావం, స్కర్వి మరియు చిగురువాపు వంటి పళ్ళు సంబంధిత సమస్యలు వస్తాయి.
నిమ్మకాయ తొక్కలలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది, ఇది విటమిన్ సి లోపాన్ని పూడ్చడంలో సహాయపడి పళ్ళు మరియు చిగుళ్ళ సంబంధిత సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది. నిమ్మ తొక్కలను ఎలా తినాలా అని ఆలోచిస్తున్నారా? నిమ్మతొక్కలను సన్నగా తురుముకొని సలాడ్స్ లేదా టీలో వేసుకొని తీసుకోవచ్చు. లేదా నిమ్మ తొక్కల తురుముకి కి పంచదార కలిపి కూడా తినవచ్చు.
కొన్ని నిమ్మ కాయలు తీసుకోని.. నిమ్మ తొక్కను మాత్రమే.. తురుము కోవాలి. కేవలం ఎల్లో కలర్ లో ఉన్న తొక్క మాత్రమే వచ్చేలా జాగ్రత్తపడాలి. ఇలా తురుముకున్న తొక్కను కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో రాసుకుని.. బ్యాండేజ్ కట్టుకోవాలి. ఇలా 2 నుంచి 3 గంటలు అలాగే పెట్టుకుంటే.. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


