Beauty Tips

Hair care Tips:ఈ ఆకు నూనె రాస్తే 7 రోజుల్లో ఊడిన చోట కొత్త జుట్టు వస్తుంది

Hair care Tips:ఈ ఆకు నూనె రాస్తే 7 రోజుల్లో ఊడిన చోట కొత్త జుట్టు వస్తుంది.. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితులు, వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో చుండ్రు,జుట్టు రాలిపోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

దీని కోసం మార్కెట్ లో దొరికే ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు. దీని కోసం గుంటగలగర ఆకుతో నూనెను తయారుచేసుకోవచ్చు.గుంటగలగర ఆకులో ఉన్న గుణాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

కాస్త ఓపిక,శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబందించిన సమస్యలను చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. గుంటగలగర ఆకు పల్లెటూర్లలో ఉండేవారికి బాగా తెలుసు. ఈ ఆకును శుభ్రం కడిగి మిక్సీలో వేసి రసం తీయాలి.

ఈ ఆకు రసం ఒక కప్పు తీసుకుంటే మరొక కప్పు కొబ్బరి నూనె తీసుకొని రెండింటినీ కలిపి ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి రసం అంతా ఇగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి. ఇలా మరిగిన నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టు కుదుళ్లకు పట్టిస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య అనేవి కేవలం వారం రోజుల్లోనే తగ్గుతాయి.

గుంటగలగర ఆకు దొరకని వారు గుంటగలగర ఆకు పొడి మార్కెట్ లో లేదా Online Stores లో లభ్యం అవుతుంది. ఆ పొడితో నూనెను తయారుచేసుకోవచ్చు. ఈ నూనె జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే నెల రోజుల వరకు వాడవచ్చు. గుంటగలగర ఆకులో ఉండే లక్షణాలు తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నూనెను వాడి జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.