MoviesTollywood news in telugu

Nuvvu Naaku Nachchav:నువ్వు నాకు నచ్చావ్ సినిమా వెనక నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో ?

Nuvvu Naaku Nachchav:నువ్వు నాకు నచ్చావ్ సినిమా వెనక నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో.. నువ్వేకావాలి మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడే తర్వాత సినిమాకోసం విజయ భాస్కర్,త్రివిక్రమ్ లకు స్రవంతి రవికిశోర్ అడ్వాన్స్ ఇచ్చేసాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శ్రీనివాస్ అపార్ట్ మెంట్ లోని స్రవంతి ఆఫీసులో రెండు నెలలు కూర్చుని కథ రెడీ చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

యూనిట్ మొత్తానికి నచ్చేసింది. ఎవరితో ఈ సినిమా తీయాలనే సమస్య. అయితే రవికిశోర్ కి దగ్గుబాటి సురేష్ తో మంచి సంబంధాలున్నాయి. విజయ భాస్కర్,త్రివిక్రమ్ లతో సినిమాకి మావాడు రెడీ అనడంతో మంచి ఆఫర్ గా స్రవంతి కిషోర్ ఫీలయ్యారు. వెంటనే ఒకే చేసారు. అయితే కొత్తగా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసారు. దానికి బ్రహ్మానందం ఒకే చెప్పాడు. స్టార్స్ అందరూ రెడీ.

ఇక హీరో, హీరోయిన్ ఫాథర్ క్యారెక్టర్స్ బాలన్స్ మిగిలింది. తండ్రి పాత్రకు ప్రకాష్ రాజ్ అయితే బాగుటుందని అనుకున్నారు. కానీ ఓ పక్క అతడు బిజీ ,మరోపక్క మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అతడిపై బాన్ విధించింది. అయితే ప్రకాష్ రాజ్ పాత్ర మినహా మిగిలిన పాత్రల షూటింగ్ చేసేస్తే ఈలోగా గొడవ కూడా తేలుతుందని భావించారు. అయితే హీరోయిన్ ఎవరా అని ముంబై వెళ్లారు.

పాగల్ పాన్ మూవీలో వేసిన అమ్మాయి నచ్చేసింది. కానీ ఆర్తి అగర్వాల్ న్యూయార్క్ లో ఉంది. ఆమెకే ఆ పాత్ర రాసిపెట్టి ఉందేమో అందుకే ఆమెకోసం ఆరా తీయడం స్టార్ట్ చేసారు. సురేష్ ఫ్రెండ్ ద్వారా ఆమె ఎడ్రెస్ పట్టేశారు. ఆమె వచ్చేసింది.

ఆర్తి అగర్వాల్ రావడంతోనే షూటింగ్ స్టార్ట్ చేసారు. ఒకే ఇంట్లో షూటింగ్ కనుక రామానాయుడు స్టూడియోలో సెట్ వేసి వేగంగా షూటింగ్ నడిపించారు. అయితే రెండు సాంగ్స్ కోసం న్యూజిలాండ్ లో ప్లాన్ చేస్తే, వెంటనే రాకపోతే సీజన్ మారిపోతుందని చెప్పడంతో ఇక్కడ షూటింగ్ ఆపేసి అక్కడికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక వెంకీకి ఫీవర్. అయినా సరే,షూటింగ్ చేసేసాడు.

ఇండియా వచ్చాక ,ఊటీ ఇలా అన్ని చోట్లా పిక్ నిక్ మాదిరిగా షూటింగ్ సాగిపోతోంది. ఈలోగా ప్రకాష్ రాజ్ పై బాన్ కూడా తీసేసారు. దాంతో అతడితో కూడా షూటింగ్ చేసారు. ఇక కోటి మ్యూజిక్ కూడా అయింది. 2001సెప్టెంబర్ 6న రిలీజ్. మూడు గంటలపైగా సినిమా ఉంది,కానీ సినిమా బాగుంది ఇదీ టాక్.

అరగంట సినిమా తగ్గించాలని, సుహాసిని ఎపిసోడ్ తొలగించాలని ఇలా రకరకాలా సూచనలొచ్చినా స్రవంతి రవికిశోర్ ఒప్పుకోలేదు. వారం అయ్యాక సినిమాకు మంచి టాక్. అందరి నోటా ఈ సినిమాయే. జాబ్,జేబు సంతృప్తి కావాలంటే స్క్రిప్ట్ పరమావధి అని రవికిశోర్ నమ్మకం.