Devotional

Kanya Rasi:కన్యా రాశిలో జన్మించారా…. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా లేకపోతే….???

Kanya Rasi:కన్యా రాశిలో జన్మించారా…. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా లేకపోతే… రాశి చక్రంలో కన్యారాశి ఆరవది. ఈ రాశి అధిపతి బుధుడు.ఈ రాశిని స్త్రీ రాశి, శుభరాశి, సమ రాశిగా వ్యవహరిస్తారు. ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు మొత్తం నాలుగుపాదాలు, చిత్త నక్షత్రపు 1, 2 పాదాలు కన్యా రాశి కిందకి వస్తాయి. ఈ రాశివారు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు.

ఈ ఆలోచన విధానమే వీరిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ధనాన్ని సంపాదించాలని అనుకుంటారు. అయితే వీరు అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. ఈ రాశివారు వారికీ అవసరం లేని విషయాలలో అసలు జోక్యం చేసుకోరు. నా కెందుకులే అనుకుంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు.

ఏ పనిని ఆషామాషీగాతీసుకోరు. ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకోని తరచుగా ఒత్తిడికి లోను అవుతారు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా విపరీతంగా పట్టించుకోని బాధపడుతూ ఉంటారు. ఈ రాశివారు ఇతరుల తప్పులను ఎట్టి చూపుతారు. అదే ఈ రాసివారి తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే మాత్రం అసలు తట్టుకోలేరు. ఈ రాశివారు ఒకరి మీద ఆధారపడిబ్రతకటానికి అసలు ఇష్టపడరు.

ఈ రాశివారికి స్నేహితులు ఎక్కువే. అలాగే వీరికి బందు ప్రీతి కూడా ఎక్కువే. వీరిలో ఏ ప్రతిభ దాగి ఉందో బాగా గమనించి ఆ రంగంలోకి వెళ్లి విజయాన్ని సాధిస్తారు. వివాహజీవితములో ఒడి దుడుకులు లేక పోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కన్యా రాశిస్వభావరీత్యా ‘ద్వి స్వభావ రాశి’. అందుచేత రెండువైపులా ఆలోచిస్తుంటారు.

ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలిస్తుంటారు. కన్యా రాశివారికి అనుమానించటం అనేది సహజసిద్ధమైన లక్షణం. అయితే ఆ అనుమానాన్ని మాత్రం అసలు బయటకు రానివ్వరు. ఈ రాశి స్త్రీలు ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశివారు చాలాదైర్యంగా ఉంటారు. వీరికి ముందు జాగ్రత్త అలాగే కొన్ని సార్లు అతి జాగ్రత్త కూడా ఉంటుంది. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ రాశివారు పెద్దవారితో అణుకువగా ఉండటంతో వీరు చేసే ప్రతి పని వారి సహకారంతో చాలా సక్సెస్ గా పూర్తి చేస్తారు. వ్యాపార మెళుకువలు తెలుసుకొని వ్యాపారంలో ముందంజ వేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.