Beauty Tips

White Hair Turn Black: ఎలాంటి ఖర్చు లేకుండా శాశ్వతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా..

White Hair Turn Black: ఎలాంటి ఖర్చు లేకుండా శాశ్వతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా.. తెల్లజుట్టు సమస్య ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చాక వచ్చేది. కానీ మారిన జీవన విధానం, ఒత్తిడి,జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి కారణాలతో తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. చిన్న వయస్సులో తెల్లజుట్టు రావటంతో చాలా కంగారు పడుతూ ఉంటారు.

అలా కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి.

వాటి గురించి మనకు తెలియక పెద్దగా పట్టించుకోము. అలాంటి మొక్కలలో బిళ్ళ గన్నేరు మొక్క ఒకటి. బిళ్ళ గన్నేరు ఆకులలో ఉన్న ఔషద గుణాలు తెల్లజుట్టును నల్లగా మార్చటానికి సహాయపడతాయి. బిళ్ళ గన్నేరు ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

గుప్పెడు బిళ్ళ గన్నేరు ఆకులను తీసుకోని శుభ్రం కడిగి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో రెండు స్పూన్ల నువ్వుల నూనె, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

ఈ విధమగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది. అదే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.