Beauty Tips

Hair Care Tips:ఈ ఆకుతో ఇలా చేస్తే 7 రోజుల్లో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది

Hair Care Tips:ఈ ఆకుతో ఇలా చేస్తే 7 రోజుల్లో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది .. జుట్టుకి సంబందించిన సమస్యలు ఉన్నప్పుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగి పోయి ఉంటారు. అలాంటి వారు ఇంటి చిట్కాలను ఫాలో అయితే తప్పకుండా మంచి పలితాన్ని పొందుతారు. మన ఇంటి చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటి ప్రయోజనాలు తెలియక పెద్దగా పట్టించుకోము.

ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది. జుట్టు రాలటానికి తలలో ఉండే చర్మంలో ముఖ్యంగా ఆ లోపలి పొరలో ఉండే కొలాజెన్ దెబ్బతినటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. కొలాజెన్ దెబ్బతినటం వలన జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

జుట్టు కుదుళ్లలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు. ఈ సమస్యను తగ్గించటానికి జామ ఆకులు బాగా సహాయ పడతాయి. జామ ఆకులో ఉండే విటమిన్ సి, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఈ రెండిటి కలయిక వల్ల జుట్టు కుదుళ్ల లో కొలాజిన్ ప్రొడక్షన్ బాగా పెరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.

జామాకులో ఉండే లైకోపిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎండ యొక్క యు వి కిరణాల నుండి జుట్టును రక్షించడానికి సహాయపడుతుంది. దీని కోసం జామ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా మరిగించాలి. మరిగిన నీటిని వడకట్టి జుట్టుకి పట్టించి రెండు నిమిషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. పైన చెప్పిన ఏ పద్దతి ఫాలో అయిన పర్వాలేదు. జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."