Beauty Tips

Dark Skin: మెడ కింద నల్లగా మారిందా..ఇలా చేస్తే కేవలం 15 నిమిషాల్లో సమస్యకు చెక్..

Dark Skin: మెడ కింద నల్లగా మారిందా..ఇలా చేస్తే కేవలం 15 నిమిషాల్లో సమస్యకు చెక్.. ముఖ్యంగా వేసవికాలలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కా మంచి పలితాన్ని అందిస్తుంది.

సాధారణంగా మనలో చాలా మంది ముఖం మీద పెట్టె శ్రద్ద మెడ మీద పెట్టరు. ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటె మెడ నల్లగా మారి అసహ్యంగా కనపడుతుంది. మెడ మీద ఏర్పడిన నలుపు పోవాలంటే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నం చేయవచ్చు.మన వంటింటిలో దొరికే వస్తువులతో సులభంగా మెడ మీద నలుపును తొలగించుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద గుజ్జు, అరస్పూన్ పసుపు, అరస్పూన్ కాఫీ పొడి, అరస్పూన్ పంచదార, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంను నల్లగా మారిన మెడ బాగంపై రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చులో సమస్య నుండి బయటపడవచ్చు. ఈ రేమిడిలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.