Devotional

Lakshmi Devi:లక్ష్మి దేవికి ఈ పువ్వుతో పూజ చేస్తే అన్ని కష్టాలే… ఇంటి నుండి వెళ్ళిపోతుంది… ఆ పువ్వు ఏమిటో తెలుసుకోండి

Lakshmi Devi:లక్ష్మి దేవికి ఈ పువ్వుతో పూజ చేస్తే అన్ని కష్టాలే… ఇంటి నుండి వెళ్ళిపోతుంది… ఆ పువ్వు ఏమిటో తెలుసుకోండి.. మనలో చాలా మంది ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మరియు కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా దేవుడికి మొక్కుకోవటం సహజమే. దేవుడి మీద ఎక్కువగా భక్తి ఉన్నవారు అయితే పూజ చేసిన తర్వాత వారు చేయాలనీ అనుకున్న పనిని మొదలు పెడతారు.

అప్పుడు పని ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతుందని వారి నమ్మకం. అయితే ఇలా కోరికలు తీర్చమని చేసే పూజల సమయంలో ఆ దేవుళ్ళకు నచ్చని పూలతో పూజ చేస్తారు. అయితే అది వారికీ తెలియకుండా చేసే తప్పు.

ఇలా చేయటం దేవుళ్లను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఏ దేవుళ్ళకు ఏ పూలంటే ఇష్టమే తెలుసుకొని పూజ చేస్తే ఆ దేవుళ్ళ అనుగ్రహం తొందరగా కలిగి అనుకున్న పనులు నెరవేరతాయి.

మీకు వీటి మీద నమ్మకం ఉంటే కనుక ఏ దేవుడికి ఏ పువ్వు ఇష్టమో తెలుసుకొని పూజలు చేయండి. చాలా మంది అన్ని దేవుళ్ళకు అన్ని రకాల పువ్వులను,పత్రాలను ఉపయోగించి పూజలు చేస్తూ ఉంటారు.

ఆలా చేయటం తప్పని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కొన్ని పువ్వులు,పత్రాలు కొన్ని దేవుళ్ళకు అసలు ఇష్టం ఉండదు. అలాంటి పూవులతో దేవుళ్ళకు పూజ చేస్తే మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని పండితుల వాదన. అయితే ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టం ఉండదో తెలుసుకుందాం. దాని ప్రకారం పూజ చేస్తే ఆ దేవుళ్ళ అనుగ్రహం తొందరగా లభిస్తుంది .

ఇప్పుడు ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టం లేదో తెలుసుకుందాం

తోలి పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే వినాయకుడిని తులసి ఆకులతో పూజించకూడదు. తులసి ఆకులతో ఎందుకు పూజ చేయకూడదో ఒక పురాణం కథ కూడా ఉంది. అయితే వినాయచవితి రోజు మాత్రం వినాయకుణ్ణి తులసితో పూజించవచ్చు.

మహా విష్ణువును గన్నేరు పూలతో అసలు పూజించకూడదు. ఒకవేళ గన్నేరు పూలతో పూజ చేసినా ప్రసన్నం అవ్వరు.

శివునికి సువాసన వచ్చే పూలతో పూజ చేయకూడదు. ముఖ్యంగా మొగలిపూవుతో అసలు పూజ చేయకూడదు. అయితే శివరాత్రి రోజు మాత్రం ఏ పూలతో అయినా పూజ చేయవచ్చు . ఆ రోజు మాత్రం ప్రసన్నం అవుతారు.

అమ్మవారికి గరికేతో పూజ చేయటం మంచిది కాదు.

లక్షిదేవిని అసలు ఉమ్మెత్త పూలతో పూజించకూడదు.

సూర్య భగవానునికి బిల్వ పత్రాలతో అర్చన అసలు చేయకూడదు.

భైరవుడికి మల్లె పువ్వులతో పూజ చేయకూడదు.

కాబట్టి ఆయా దేవుళ్ళకు ఇష్టం లేని పూలతో పూజించి వారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఇష్టమైన పూలతో పూజ చేసి అనుగ్రహం పొందాలి.