Beauty Tips

Coffee For Face:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది

Coffee For Face:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది.. ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు,మురికి వంటివి లేకుండా ముఖం తెల్లగా కాంతి వంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభ్మగా సమస్యల నుండి బయట పడవచ్చు.

ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పొడి, 4 స్పూన్ల పచ్చిపాలు వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. పాలల్లో కాఫీ పొడి., కార్న్ ఫ్లోర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే ఒక పేస్ట్ లా తయారవుతుంది. .

ఈ పేస్ట్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే మూడు రోజులు వరకు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ ని ముఖం మీద రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద జిడ్డు, మురికి, నలుపు, మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.

కాఫీలో ఉండే కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహాయపడుతుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా మృదువుగా మంచి కాంతితో మెరుస్తూ ఉంటుంది. కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి స్కిన్ కూడా హెల్దీ గా ఉంటుంది. కాఫీ పొడి చాలా సులువుగా అందుబారులో ఉంటుంది.

కార్న్ ఫ్లోర్ ముఖం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఈ ప్యాక్ తయారుచేసుకొని వాడి మచ్చలు లేకుండా తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండీ.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.