DevotionalToday Rasi Phalalu In telugu

Lucky Zodiac Signs:మీ రాశిని బట్టి దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన వరాల గురించి తెలుసా..?

Lucky Zodiac Signs:మీ రాశిని బట్టి దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన వరాల గురించి తెలుసా.. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతారు. అలాగే కొంతమంది వాటిని అసలు పట్టించుకోరు. ఇప్పుడు చెప్పబోయే విషయాలు జాతకాలను నమ్మే వారి కోసం. రాశిని బట్టి దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి దేవుడు ఇచ్చిన వరం గౌరవం. అయితే ఎదుటి వ్యక్తి నుండి గౌరవం పొందాలంటే మేష రాశి వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఆ గౌరవం అనేది ఒక నిర్దిష్ట వయస్సు వచ్చాక మాత్రమే వస్తుంది. వీరు అందరిని తేలికగా నమ్మేస్తారు. అంతేకాక ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు ఆ పని సక్సెస్ గా అవుతుందని గట్టి నమ్మకంతో పనిచేస్తారు.

వృషభ రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం శక్తి. అయితే ఈ శక్తి వారికి తెలియకుండానే వారిలో నిక్షిప్తం అయ్యి ఉంటుంది. వీరు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ఎవరికైనా సాయం కావాలంటే వెంటనే స్పందించి వారి తెలివితేటలతో సమస్యను పరిష్కరిస్తారు. వీరు వారి మీదే కాస్త శ్రద్ద పెట్టుకుంటే చాలా ప్రతిభ బయటకు వస్తుంది.

మిధున రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం మాట తీరు. వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ అపారంగా ఉంటాయి . వీరు విషయాన్ని సేకరించటంలోనూ,ఇతరులను ఏ విషయమైనా ఒప్పించగల నేర్పరులు. ఇద్దరు గొడవలు పడినప్పుడు వారి మధ్య సయోధ్యకు చాలా చాకచక్యంగా కుదురుస్తారు. అలాగే మధ్యవర్తిత్వం చేయటంలో నేర్పరులు. వీరు మాటతీరుతో అందరిని ఆకర్షిస్తారు. వీరికి దేవుడు ఇచ్చిన కమ్యూనికేషన్ స్కిల్స్ కి పదును పెట్టుకుంటే మాత్రం అది వీరికి జీవనోపాధిగా ఏర్పడి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం లాభం. వీరు ఏ పనిలో అయినా లాభనష్టాలను ముందుగానే అంచనా వేస్తారు. అలాగే కుటుంబ సభ్యులు,స్నేహితులు ఇలా ఎవరికీ నష్టం రాకుండా లాభాలు వచ్చేలా ప్రణాళికలు చేస్తారు. వీరు ప్రతి ఒక్కరి పట్ల విధేయతగా ఉంటారు. వీరు ఎవరిని ఒక పట్టాన నమ్మరు. వీరు హడావిడి,తొందరపాటు లేకుండా నిలకడగా ఉంటారు. వీరు ఏ పని చేసిన బాగా అలోచించి లాభం వచ్చేలా ముందడుగు వేస్తారు.

సింహ రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం అహంకారం. అయితే ఈ అహంకారం అనేది ఎదుటి వారికీ అహంకారంగా కన్పించిన అది మాత్రం వారి మీద వారికున్న నమ్మకం,విశ్వాసం. వీరు చేసే ప్రతి పనిని సాధించే వరకు వదిలి పెట్టరు. అలాగే ఏ పనిని కష్టం అని అనుకోరు. వీరు ఏ పరిస్థితిలో ఉన్న సరే సక్సెస్ గా నెట్టుకొచ్చేస్తారు. వీరు ఎదుటి వారితో పనులను చాలా సులభంగా చేయించేస్తారు. వీరి ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. వీరు ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకోవటం వలన ఎదుటివారికి అహంకారులుగా కనపడతారు.

కన్యా రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం సర్దుబాటు. వీరు ప్రతి విషయంలోనూ సర్దుబాటు ధోరణి కనపరుస్తారు. అలాగే ఎదుటి వారు చేసిన తప్పులను చాల సులభంగా క్షమించేస్తారు. వీరితో ఎవరైనా గొడవ పడితే వారి కంటే వీరే ముందుగా వెళ్లి మాటలు కలుపుతారు. వీరు ప్రతి పనిని నిదానంగా సులభంగా చేస్తారు. వీరిని వ్యాపారంలో భాగస్వామి ఏమి అన్నా పట్టించుకోకుండా సర్దుబాటు ధోరణితో తన పని తాను చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరు చేసే పనిలో ప్రయోజనాన్ని ఆశించరు.

తులా రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం జస్టిస్ . వీరు ప్రతి విషయాన్నీ సహజసిద్ధంతో,న్యాయబద్దంగా ఆలోచన చేస్తారు. వీరి కారణంగా ఎవరికైనా నష్టం,ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే ఆ పనిని చేయటం మానేస్తారు. వీరు ఎదుటి వారిని నొప్పించకుండా ముందుకు సాగుతారు. వీరు మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకుంటారు. అందువల్ల వీరు ఆ రంగాన్ని ఎంచుకుంటే మంచిది. వీరు ఎదుటి వారి నుండి ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా సాయం చేస్తారు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం మర్యాద. వీరు ఎదుటివారికి ఎక్కువగా మర్యాదను ఇస్తారు. అలాగే ఎదుటి వారిలో తప్పులను కాకూండా పాజిటివ్ అంశాలను గుర్తిస్తారు. ఎదుటి వారు వీరితో ఎలా ఉంటే వీరు కూడా వారితో అలానే ఉంటారు. ఎదుటి వాడు చెడ్డవాడు అయినా సరే వీరితో వారు ఎలా ఉంటే అలానే ఉంటారు. ఎదుటి వాడు విషాన్ని ఇచ్చినా అమృతంగా భావించే అమాయకపు తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయాన్నీ ఎదుటి వారి వైపు నుంచే ఎక్కువగా ఆలోచిస్తారు.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం అదృష్టం. వీరు ఎక్కువ అదృష్టాన్ని కలిగి ఉంటారు. వీరికి ఏదైనా అవసరం అయినప్పుడు దాని గురించి ఆలోచించే లోపు అది వారికీ అందుతుంది. వీరు ఏ విషయంలోనూ ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదు. అయితే ఇంటిలో గాని,బందువులకు కానీ సమస్యలు వచ్చినప్పుడు వీరికి అవగాహన లేకపోవటం వలన ఎలాంటి సహాయం చేయకపోవచ్చు. అంతేకాక ఆ సమస్య చెప్పేవరకు ఈ రాశి వారు గుర్తించకపోవచ్చు.

మకర రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం సక్సెస్. వీరు ఏ పని చేసిన చాల సులభంగా చేసేస్తూ ఉంటారు. వీరు ఏ పనిని అయినా సాధించగలం అనే గట్టి నమ్మకంతో ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో ఉత్తమమైన లక్ష్యం,ఫలితాన్ని ఆశిస్తారు. దీని కోసం ఎంతైనా కష్టపడతారు. వీరు కొంచెం కష్టపడినా చాలు అనుకున్నది సాధించేస్తారు. వీరు వ్యాపారంలో ఎటువంటి నష్టం లేకుండా లాభాలను పొందుతూ మంచి పేరు సంపాదిస్తారు.

కుంభ రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం యూనిక్. వీరు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగుతారు. సొంత పని అయినా ఎదుటి వారి పని అయినా సరే అందరిని కలుపుకుంటూ ముందుకు సాగుతారు. వీరు ఎవరిని చిన్న చూపు చూడరు. అలాగే అనవసరంగా పక్కన పెట్టటం వంటివి అసలు చేయరు.

మీనా రాశి
ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం ఆలోచనాశక్తి. వీరు ఏ విషయం అయినా ముందుగానే ఆలోచిస్తారు. ఏ సమస్య వచ్చిన ముందుగానే పసిగడతారు. అలాగే శని పరిష్కారాన్ని కూడా వారి ఆలోచనశక్తితో ఇట్టే చెప్పేస్తారు. వీరు వీరి లక్ష్యాలను సాధిస్తూనే ఎదుటి వారి లక్ష్యాలకు సాయం అందిస్తారు. వీరు భవిష్యత్ గురించి వేసే అంచనాలు ఎప్పటికి తప్పు కావు. అందుకే వీరు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.