Devotional

Vastu Tips For Tulasi:తులసి మొక్క ఇంట్లో ఉంటే ఈ నియమాలు పాటించాలి.. లేకపోతే అర్థిక సమస్యలు తప్పవు..!

Vastu Tips For Tulasi:తులసి మొక్క ఇంట్లో ఉంటే ఈ నియమాలు పాటించాలి.. లేకపోతే అర్థిక సమస్యలు తప్పవు.. ప్రతి ఇంట్లో దాదాపుగా తులసి మొక్క ఉంటుంది. హిందూ ధర్మంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు.

తులసి మొక్కను ప్రతిరోజు పూజిస్తారు. తులసి మొక్క ఆధ్యాత్మిక పరంగాను, ఆరోగ్యపరంగానూ చాలా ప్రసిద్ధి చెందింది. అయితే తులసి మొక్కను నాటే ముందు కొన్ని నియమాలను పాటించాలి. ఒకవేళ పాటించకపోతే కొన్ని సమస్యలు వస్తాయి.

తులసి మొక్కను నాటటానికి కార్తీక మాసం ఉత్తమ సమయం. ఇంటిలో తులసి మొక్క లేని వారు కార్తీకమాసంలో నాటితే లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందని ఒక నమ్మకం.శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు సింధూరాన్ని సమర్పించవచ్చు.

వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి. ఈ దిశలో దేవతలు నివసిస్తారని ఒక నమ్మకం. తులసి మొక్కను దక్షిణ దిశలో అసలు నాటకూడదు. ఈ దిక్కు పూర్వీకులది. అందువల్ల దక్షిణ దశలో తులసి మొక్కను నాటితే తీవ్ర ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది.

తులసి మొక్కను ఇంటి బాల్కనీ లేదా కిటికీలో పెట్టవచ్చు. అయితే వాస్తు శాస్త్రంలో ఇచ్చిన దిశను బట్టి మాత్రమే పెట్టాలి. తులసి మొక్కను వంటగది లేదా బాత్రూం లేదా ఇంటి ముఖద్వారం వద్ద లేదా చెత్తను ఉంచే ప్రదేశంలో అసలు ఉంచకూడదు.

తులసికి నీటిని సమర్పించడమే కాకుండా పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు. పచ్చిపాలను సమర్పించడం వలన దురదృష్టం తొలగి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

https://www.chaipakodi.com/