Devotional

Monday:సోమవారం నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదు… ఆ పనులు ఏమిటో తెలుసా?

Monday:సోమవారం నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదు… ఆ పనులు ఏమిటో తెలుసా.. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతారు. అలాగే కొంత మంది జాతకాలను నమ్మరు. ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయో దాని ప్రకారం వెళ్లాలని జ్యోతిష నిపుణులు చెప్పేమాట. అందులో భాగంగా సోమవారం గురించి ప్రస్తావిస్తే, సోముడు అంటే చంద్రుడు. అందుకే చంద్రుడు ఆధిపత్యం వహించే రోజు సోమవారం.

మనసుకి సంబంధించిన గ్రహం చంద్రుడు. అందుకే జాతకంలో చంద్రుడు ఏ వ్యక్తికి మంచిగా ఉంటాడో ఆ వ్యక్తికి సోమవారం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ జాతక రీత్యా చంద్రుడు అనుకూలంగా లేకుంటే అలాంటి వారికి పనులు ఆలస్యంగా అవుతాయి. పైగా నిస్సత్తువ , నీరసం వంటివి ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీలైనంతవరకూ ఇలాంటి వాళ్ళు సోమవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది.

ఇక ఏ పని చేయాలన్న శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా ఉండాలి. ఓ సర్జరీ చేయించుకోవాలన్నా,ఇంటర్యూకి వెళ్లాలన్నా, ఇలా కీలక విషయాల్లో మానసికంగా బలం ఉండాలి. అప్పుడు సోమవారం బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనస్సు కొట్టుమిట్టాడుతోందో అలాంటివాళ్ళు సోమవారం వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం.

ముఖ్యంగా సోమవారం మనస్కారకుడు చంద్రుడు కనుక మానసికంగా శ్రమించే పనులు ఎక్కువగా చేయడం చాలా మంచిది. ఇక సోమవారం స్త్రీలకు మంచిరోజు. స్త్రీలు శక్తిగా గల రోజు. అందుకే సోమవారం పనులు ప్రారంభిస్తే మంచిదని విశ్లేషిస్తున్నారు నిపుణులు. అంతేకాదు తల్లికి , కుటుంబానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా స్త్రీలు సోమవారం నిర్ణయం తీసుకుంటే మంచిది.

ఇక ఉద్యోగాల్లో చేరడానికి,నూతన పనులు చేయడానికి కూడా వీరికి సోమవారం శ్రేయస్కరం.షాపింగ్ చేయడానికి,ఇంటికి సంబంధించిన ఫ్రిజ్, కూలర్ వంటివి కొనుగోలుకు సోమవారం మంచిది. ప్రధానంగా వెండి కొనుగోలు కూడా సోమవారం చాలా మంచిదే. బంధువులు ఎవరితోనైనా విబేధాలుంటే వారితో సఖ్యత కోరుకుంటే సోమవారం ఆదిశగా ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది.

ఇక విద్యార్థులు ఏదైనా నూతనంగా ప్రారంభించాలంటే సోమవారం ప్రారంభిస్తే మంచిది. పిల్లలను స్కూల్ లో చేర్చడానికి కూడా సోమవారం అనుకూలమే. బంగారు వస్తువులు కొంటే, వాటిని వాడడానికి, ధరించడానికి సోమవారం మంచిది. ఇక గతంలో సోమవారం పనులు ప్రారంభిస్తే,ఎన్ని పూర్తయ్యాయి,ఎన్ని జరగలేదు అన్నవి భేరీజు వేసుకుని మరీ సోమవారం పనులు ప్రారంభిస్తే ఇంకా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.