Beauty Tips

White Hair Turn Black:నాచురల్‌గా మీ తెల్ల జుట్టును నల్లగా మార్చేసుకోండిలా…చాలా సింపుల్

White Hair Turn Black:నాచురల్‌గా మీ తెల్ల జుట్టును నల్లగా మార్చేసుకోండిలా…చాలా సింపుల్.. మారిన జీవనశైలి కారణంగా తెల్లజుట్టు చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. తలలో ఒక తెల్ల వెంట్రుక వచ్చినా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంత మంది అయితే బయటకు వెళ్ళటానికి కూడా చాలా బాధపడిపోతారు.

అయితే కంగారు పడకుండా ఇంటిలో ఉండే కొన్ని పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టు రాగానే చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం(Weather Pollution), ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు.

తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని వాడటం వలన తాత్కలికంగా జుట్టు నల్లగా మారినా.. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చర్మ సమస్యలు(Skin Problems), దురదలు, దద్దుర్లు వంటివి వస్తాయి. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పొయ్యి మీద ఇనప మూకుడు పెట్టి రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసి నల్లగా అయ్యేవరకు వేగించాలి. ఈ పొడి చల్లారిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోని ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ కలబంద గుజ్జు,ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అలా వదిలేయాలి.

గంట తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే.. షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. అలా చేస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తక్కువ తెల్లజుట్టు ఉంటే తక్కువ సమయంలోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

ఇది కూడా చదవండి:Tips To Reduce Uric Acid:పరగడుపున ఈ టీ తాగితే..యూరిక్ యాసిడ్ తొలగిపోతుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.