Beauty Tips

Skin Care Tips: బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలల్లో ఖర్చు చేస్తున్నారా..? పసుపులో ఈ రెండింటినీ కలిపి రాసుకుంటే..!

Skin Care Tips: బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలల్లో ఖర్చు చేస్తున్నారా..? పసుపులో ఈ రెండింటినీ కలిపి రాసుకుంటే..మనలో చాలా మంది అందంగా కనపడటానికి బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలల్లో ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన వంటింటిలో అందుబాటులో ఉండే పసుపును ఉపయోగించి ముఖం మీద మచ్చలు,పిగ్మెంటేషన్‌, మొటిమల వంటి సమస్యలను తొలగించుకొని ముఖం కాంతివంతంగా చేసుకోవచ్చు.

పసుపులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కర్కుమిన్ ఉండుట వలన నల్లని మచ్చలు,పిగ్మెంటేషన్‌ తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలు,సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

అంతేకాకుండా అకాల వృద్ధాప్యాన్ని నివారించి ముడతలు లేకుండా చేస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు స్పూన్ల పెరుగు, అరస్పూన్ పసుపు వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండానే ఇంటిలోనే చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా చర్మ సమస్యలను తగ్గించుకొని మెరిసే తెల్లని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. పసుపు ఫేస్ ప్యాక్ చర్మాన్ని డల్ నెస్ నుండి మెరిసేలా చేస్తుంది.

పసుపు మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ మన ఇంటిలో పసుపు కొమ్ములను తెచ్చుకొని అడించుకుంటే మంచిది. మార్కెట్ లో దొరికే పసుపులో కల్తీ జరిగే అవకాశం ఉంది..లేదంటే మార్కెట్ లో దొరికే ఆర్గానిక్ పసుపు వాడిన పర్వాలేదు.

ఇది కూడా చదవండి:Matcha Tea: జపాన్‌లో ఫేమస్ అయినా మచా టీ ఎప్పుడైనా తాగారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…?

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.