Beauty Tips

Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళే సమయం లేదా….కాఫీ పొడితో ఇలా చేస్తే ముఖం అందంగా..

Coffee Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళే సమయం లేదా….కాఫీ పొడితో ఇలా చేస్తే ముఖం అందంగా.. ముఖం తెల్లగా మెరవటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే బ్యూటీ పార్లర్ కి వెళ్ళే అవసరం ఉండదు. మన ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళే ముందు ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఫంక్షన్ కు వెళ్ళటానికి ముందు కాఫీతో ఫేషియల్ చేసుకోవాలి. ఇది ఫేషియల్ బ్లీచ్ లా పని చేస్తుంది. కొబ్బరినూనెలో కొంచెం నీటిని కలిపి ముఖానికి బాగా పట్టించాలి.

ఒక నిమిషం మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ నిమ్మరసం,అరస్పూన్ తేనె, ఒక స్పూన్ ఫెయిర్‌నెస్ క్రీమ్, ఒక స్పూన్ బియ్యం పిండి వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలు క్లీన్ అవ్వడమే కాదు స్కిన్ అందంగా, ఆరోగ్యంగా మెరుస్తుంది. ముఖంలోని టాన్, మురికి కూడా తొలగిపోతుంది. కాఫీ-తేనె, నిమ్మరసం ముఖాన్ని బాగా శుభ్రపరచి చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి: Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుందా.. అయితే ఈ పని చేయండి చాలు..!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."