Beauty Tips

Hair Fall Oil:ఈ నూనెను 7 రోజులు ఇలా వాడితే తల నుండి ఒక్క వెంట్రుక రాలదు

Hair Fall Oil:ఈ నూనెను 7 రోజులు ఇలా వాడితే తల నుండి ఒక్క వెంట్రుక రాలదు.. వాతావరణంలో కాలుష్యం,ఒత్తిడి,జుట్టుకి సరైన పోషణ చేయకపోవటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి.

దీనికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే నూనెలు,షాంపూల మీద ఆధారపడి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
cococnut Oil benefits in telugu
పొయ్యి మీద మూకుడు పెట్టి 100 ml కొబ్బరి నూనె పోయాలి. కొబ్బరి నూనెకి బదులు ఆవనూనె కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఒక Onionను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు Curry Leaves, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ kalonji seeds వేసి 10 నిమిషాలు మరిగించాలి.
Onion benefits in telugu
బాగా మరిగిన ఈ నూనె కాస్త చల్లారాక వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయటం వలన రక్తప్రసరణ బాగా సాగి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నూనె రాశాక గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
Curry Leaves Health benefits In telugu
పగటి సమయంలో కుదరని వారు రాత్రి సమయంలో నూనెను జుట్టుకి రాసి మసాజ్ చేసి cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
hair fall tips in telugu
ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తాయి. అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నూనెను వాడి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.