Beauty Tips

White Hair Turn Black:నెయ్యిలో వీటిని కలిపి రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..మిస్ కాకండి

White Hair Turn Black:నెయ్యిలో వీటిని కలిపి రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..మిస్ కాకండి.. ఒకప్పుడు తెల్లజుట్టు అనేది 60 ఏళ్ళు దాటాక వచ్చేది. కానీ ఇప్పటి రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే అంటే 25 నుంచి 30 ఏళ్ళు వచ్చేసరికి వచ్చేస్తుంది. దాంతో కంగారు పడి ఆర్టిఫీషియల్ కలర్స్ వైపు అడుగులు వేస్తున్నారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టు నుండి బయట పడవచ్చు. నెయ్యితో తయారైన ఈ నూనెని రాయడం వల్ల తెల్లజుట్టు తగ్గడమే కాకుండా, జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

ఈ నూనె తయారుచేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కలోంజీ గింజలను కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఇనుప మూకుడు పెట్టి దానిలో అరకప్పు నువ్వుల నూనె, పావుకప్పు ఆవు నెయ్యి, రెండు స్పూన్ల కలోంజీ పొడి, గుప్పెడు కరివేపాకు వేసి బాగా మరిగించి ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. నెయ్యి లో ఉండే పోషకాలు జుట్టుకి తేమను అందిస్తాయి. తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది.

కరివేపాకులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండుట వలన తెల్లజుట్టును నల్లగా మార్చటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలోంజి గింజలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ నూనెను తయారుచేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.