Devotional

Navagraha pradakshina:నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి…ఎలాంటి ఫలితం…?

Navagraha pradakshina:నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి…ఎలాంటి ఫలితం… నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలుసుకుందాం. ఒకప్పుడు కొన్ని ఆలయాల్లోని నవగ్రహాలు ఉండేవి.

ఇప్పుడు దాదాపు అన్ని ఆలయాల్లో నవగ్రహాలను ఏర్పాటు చేసున్నారు. ఎందుకంటే నవగ్రహాలను పూజించే వారి సంఖ్య కూడా పెరిగింది. కనీసం 9సార్లు ప్రదక్షిణాలు చేయడం చూస్తుంటాం. దోష పరిహారార్ధం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా ప్రదక్షిణలు,పూజలు చేస్తుంటారు.

ఇక కంటికి కనిపించే సూర్య చంద్రులు ప్రత్యక్ష దైవాలుగా కొలిచేవాళ్ళు ఉన్నారు. సూర్యునికి 10ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం ప్రసాదిస్తాడని చెబుతారు. ఇక చంద్రుడికి 11 ప్రదక్షిణలు చేస్తే, పేరు ప్రఖ్యాతులు వస్తాయని అంటారు.

గౌరవ ప్రతిష్టల కోసం గురు గ్రహానికి 3గానీ,12గానీ,21గానీ ప్రదక్షిణలు చేస్తారు. ఇక శుక్ర గ్రహానికి 6ప్రదక్షిణలు చేస్తుంటారు. కాగా సిరిసంపదలు,బుద్ధి కుశలత కోసం అంగారకుడికి 5గానీ,12గానీ,23గానీ ప్రదక్షిణలు చేస్తుంటారు.

ధైర్య సాహసాల కోసం రాహు గ్రహానికి 4సార్లు, వంశాభివృద్ధి కోసం కేతు గ్రహానికి 9ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక కీలకమైన శనిగ్రహం కటాక్షం కోసం 8ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వలన దోష రహితం అవుతుందని చెబుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.