Devotional

Zodiac Sign For Food:రాశిచక్రం ప్రకారం ఏ రాశి వారు ఏ ఆహారం తినాలో తెలుసా..?

Zodiac Sign For Food:రాశిచక్రం ప్రకారం ఏ రాశి వారు ఏ ఆహారం తినాలో తెలుసా.. జ్యోతిష్య శాస్త్రంలో జాతక చక్రంలో రాశుల ప్రకారం వ్యక్తుల యొక్క మనస్తత్వం తెలుసుకోవచ్చు. ఒక్కో రాశి వారికీ ఒక్కో రకమైన భవిష్యత్ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ఆహారాలను తింటే జాతక చక్రం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏ రాశివారు ఏ ఆహారం తింటే వారి జాతక చక్రం మీద ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. రాశిని బట్టి ఆహారాలను తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశివారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. వీరికి కేలరీలు అధికంగా ఉన్న ఆహారం అంటే అమితమైన ప్రీతి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే వీరికి రాశి ప్రభావం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

వృషభ రాశి

ఈ రాశివారికి కూడా తిండి అంటే ఇష్టమే. ఒకరకంగా చెప్పాలంటే వీరు భోజన ప్రియులు. ఈ రాశివారు స్వీట్స్ మరియు బ్రెడ్ వంటివి తినకుండా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.

మిథున రాశి

ఈ రాశివారు అధిక బరువును కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వలన తరచుగా అనారోగ్యానికి గురి అవుతారు. కాబట్టి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటమే మంచిది. ఈ రాశివారు ఏ ఆహారం అయినా ప్రతి రోజు నిర్దిష్టమైన సమయంలో తినటం అలవాటు చేసుకోవాలి.

కర్కాటక రాశి

ఈ రాశివారికి బయట ఫుడ్ కన్నా ఇంటి ఆహారం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. ఈ రాశివారు ఏ ఆహారం తిన్నా క్వాలిటీ ఉండాలని అనుకుంటారు. వీరు తిండిపై నియంత్రణ కలిగి ఉండాలి. అతిగా తినకుండా మితంగా తినటం అలవాటు చేసుకోవాలి.

సింహ రాశి

ఈ రాశివారు విలాసంగా ఖరీదైన ఫుడ్ అంటే చాలా ఇష్టం. వీరికి వంట చేయటం ఇష్టం ఉండదు. కుటుంబంతో కలిసి భోజనం చేయటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తాజా కూరగాయలు,పండ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిది.

కన్య రాశి

ఈ రాశివారికి జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహారాల జోలికి వెళ్లకుండా తాజా ఆహారాన్ని తీసుకోవాలి.

తుల రాశి

ఈ రాశివారు మంచి భోజన ప్రియులు. వీరికి మద్యంతో ఆహారాన్ని తీసుకోవటం అంటే ఇష్టం. ఈ రాశివారు ఎక్కువగా చాకోలెట్స్,స్వీట్స్ తింటారు. వీటి కోసం భోజనాన్ని కూడా మానేస్తారు. ఈ రాశివారు చాకోలెట్స్,స్వీట్స్ తినటం మానేస్తే మంచిది.

వృశ్చిక రాశి

ఈ రాశివారు వంట బాగా చేస్తారు. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. జంక్ ఫుడ్ మరియు మద్యానికి దూరంగా ఉండాలి. మంచినీటిని ఎక్కువగా త్రాగాలి.

ధనుస్సు రాశి

ఈ రాశివారు ఏది తిన్నా అతిగానే తింటారు. వీరికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అందువల్ల ఈ రాశివారికి స్థూలకాయం, బీపీ, జీర్ణ సమస్యలు వస్తాయి. అందువల్ల ఏ ఆహారం తీసుకున్న మితంగా తీసుకోవటం మంచిది.

మకర రాశి

ఈ రాశివారు చక్కని భోజనం ప్రశాంతంగా తినాలని అనుకుంటారు. వీరు ఇంటి భోజనాన్ని ఇష్ట పడతారు. వీరికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. వీరు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అదే ఈ రాశి వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది

కుంభ రాశి

ఈ రాశివారు ఇతరులతో ఆహారాన్ని షేర్ చేసుకుని మాత్రమే తింటారు. ఈ రాశివారు జంక్ ఫుడ్ తినకూడదు. తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో రాశి ప్రభావం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మీన రాశి

ఈ రాశి వారు మంచి భోజన ప్రియులు అయి ఉంటారు. మద్యం తాగుతూ ఆహారం తీసుకోవడం అంటే వీరికి మహా ఇష్టం. వీరు ప్రతి రోజూ నీటిని ఎక్కువగా తాగాలి. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసే డిటాక్స్ డైట్‌ను వీరు ఫాలో అవ్వాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.