Devotional

Guava Fruits In Pooja :జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు ఏమిటో తెలుసా?

Guava Fruits In Pooja :జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు ఏమిటో తెలుసా.. గుడికి వెళ్లడం, కొబ్బరికాయ అరటి పళ్ళు సమర్పించడం చేస్తుంటాం. దండాలు పెట్టుకుని కోర్కెలు చెప్పుకుంటారు. అయితే దేవుడికి జామపండు నైవేద్యంగా సమర్పిస్తే ఇక అనుకున్న పనికి తిరుగుండదట. వినాయకుడికి జామపండు నైవేద్యంగా పెడితే, అధిక ప్రయోజనం సిద్ధిస్తుందట.

గౌరీదేవికి జామపండు నైవేద్యంగా సమర్పిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని కొందరు జ్యోతిష్య పండితులు చెప్పేమాట. ఇక జామ పండ్లను పూజ చేయించి, పెళ్లికాని అమ్మాయిలు వాటిని సుమంగళిలకు వాయనంగా ఇస్తే త్వరగా పెళ్లి అవుతుందట. దుర్గాదేవికి జామపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే, త్వరగా సంతానం కలుగుతుందట.
Lord shiva
లక్ష్మీ నారాయణుడికి జామపండ్లు నైవేద్యంగా సమర్పించి దంపతులకు అందిస్తే, వాళ్ళల్లో అన్యోన్యత కలుగుతుందట. రుద్రాభిషేకం సమయంలో జామపండు రసంతో అభిషేకిస్తే పనులు త్వరగా పూర్తవుతాయట. మొత్తానికి జామ పండ్లను నైవేద్యంగా సమర్పించి శుభయోగాలు పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.