Beauty Tips

Head Lice:పేల సమస్యకు చెక్ పెట్టాలంటే…ఈ చిట్కాలు ఫాలో..

Head Lice:పేల సమస్యకు చెక్ పెట్టాలంటే…ఈ చిట్కాలు ఫాలో.. పేల సమస్యను తగ్గించుకోవటానికి చాలా కష్టపడాలి. ఒక్కసారి వచ్చాయంటే తగ్గటం చాలా కష్టం. ఎన్ని నూనెలు వాడిన పెద్దగా పలితం ఉండదు. దాంతో చాలా విసుగు వస్తుంది. అలా విసుగు రాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు.

పేలు అనేవి ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. .మ‌న ర‌క్తాన్ని తాగుతూ.వెంట్రుకుల‌ను అంటిపెట్టుకుని ఉండే ఈ పేలు చాలా చిరాకు తెప్పిస్తాయి.పేలను వదిలించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాగే వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టి క్రీమ్ లు,నూనెలు వాడుతూ ఉంటాం.

అయిన పెద్దగా ఫలితం ఉండదు. అయితే పేలు సమస్యను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. పేలను తగ్గించుకోవటానికి వేప చాలా బాగా పనిచేస్తుంది. వేప ఆకులను పేస్ట్ గా చేసి దానిలో నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా రాసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పేలు నాశ‌నం అవ్వ‌డంతో పాటు చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.పేలను వదిలించుకోవటానికి మెంతులు కూడా చాలా బాగా సహాయపడతాయి. రెండు స్పూన్ల మెంతుల‌ను రాత్రంతా నీటితో నాన‌బెట్టుకుని ఉద‌యాన్నే పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా హార‌తి క‌ర్ఫూరం క‌లిపి త‌ల‌కు ప‌ట్టించాలి.అర గంట తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పేలు నాశ‌నం అవ్వ‌డంతో పాటు చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.