Beauty Tips

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుందా.. అయితే ఈ పని చేయండి చాలు..!

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుందా.. అయితే ఈ పని చేయండి చాలు.. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. చుండ్రు ఒకసారి వచ్చిందంటే తగ్గించుకోవడం చాలా కష్టం. మనలో చాలా మంది చుండ్రు రాగానే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు వెళ్తూ ఉంటారు. మన ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

బాగా వేడిగా ఉన్న నీటితో తల స్నానం చేయడం, వాతావరణంలో వచ్చే మార్పులు, తలపై తేమ తగ్గిపోవడం వంటి కారణాలతో చుండ్రు సమస్య వస్తుంది. కొంతమందిలో చుండ్రు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే చుండ్రు సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ టీ పొడి, ఒక స్పూన్ మెంతిపొడి, ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసి మరిగించాలి.

దాదాపుగా నీరు సగం అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడగట్టి దానిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోయాలి. ఈ నీటిని స్కాల్ప్ కు బాగా పట్టేలా స్ప్రే చేయాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం ఉంటుంది.

ఈ నీటిని ఒక సారి తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ చిట్కా చుండ్రును తగ్గించటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఇది కూడా చదవండి: Health Facts:మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేస్తున్నారు…ఒంటి గంట దాటుతుందా…ఈ నిజం తెలుసుకోండి

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.