Devotional

Dream:ఈ 10 జంతువుల్లో కలలో ఏ జంతువు కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసా ?

Dream:ఈ 10 జంతువుల్లో కలలో ఏ జంతువు కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసా.. ప్రతి మనిషికి నిద్ర పోయినప్పుడు కలలు రావటం అనేది సహజమే. అందరికి ఒకేలా కలలు రావు. ఒక్కొక్కరికి ఒక్కోరకంగా కలలు వస్తూ ఉంటాయి. కొందరికి వచ్చే కలలు నవ్వుతెప్పిస్తే, మరికొందరికి భయాన్ని కలిగిస్తాయి.

మరికొందరికి జీవితంలో జరిగే విషయాలు కలలుగా వస్తాయి. చాలా మందికి కలలో జంతువులు కన్పిస్తూ ఉంటాయి. అయితే ఇలా కలలో జంతువు కనపడటం శుభమా… అశుభమా? ఇప్పుడు ఏ జంతువు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

సింహం

సింహం శక్తి,దూకుడు,బలానికి ప్రతీక. మీ ప్రభావము ఇతరులపై ఎక్కువగా ఉంటుందని,మంచి సంబంధాలు ఇతరులతో కలిగి ఉండాలంటే దీనిని నియంత్రించాలని అర్ధం. సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచన.

పులి

పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉన్న పులి కలలో కనిపిస్తే అణచివేయ‌బడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి కలలో వస్తే ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి సూచన.

తాబేలు

తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీకు ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కోసం సరి అయిన అడుగు వేయాలని సూచిస్తుంది.

లేడి

లేడి అందానికి,దయ,సున్నితత్వానికి గుర్తు. లేడి అనేది మీలో సున్నిత భావాలకు సూచన. మీకు లేడిని చంపుతున్నట్టు కల వస్తే దయ, సున్నితత్వం అణిచివేస్తున్నట్టు అర్ధం. కలలో నల్ల లేడి వస్తే మీరు సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్టు అర్ధం.

కుందేలు

కుందేలు కలలో కనిపిస్తే భవిష్యత్ సానుకూలంగాను ఆశాజనకంగాను ఉంటుందని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు,అదృష్టానికి చిహ్నం. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పచ్చిక బయళ్ళలో ఆడుకుంటూ తెల్ల కుందేలు కన్పిస్తే ఆనందకరమైన వార్తను వింటారని అర్ధం.

ఏనుగు

ఏనుగు శక్తి, బలం, తెలివికి చిహ్నం. మీకు కలలో ఏనుగు కనపడితే ఎదుటి వారితో ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్ధం.ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలో దాగి ఉన్న అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్థం.

మేక

మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవటాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది. కాబట్టి మేక పోతు కనిపిస్తే, మీకు వ్యాపారంలో పోటీదారులు మీ వ్యాపారాలను కూల్చివేయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్ధం.

గుర్రం

తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు అదృష్టానికి సూచన.నల్ల గుర్రం హింస, క్షుద్ర శక్తులకు సూచన. అడవి గుర్రాల మంద బాధ్యతా రాహిత్యానికి సూచన. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీ నియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్ధం. గుర్రం మీద స్వారీ చేస్తూ నియంత్రణ లేకపోతే మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్థం.

పాము

పాము ప్రమాదకరమైన జంతువు. పాము చాలా మంది కలలో కన్పిస్తూ ఉంటుంది. పాము కలలో వస్తే మీరు భయపడుతున్నారని,అలాగే జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అర్ధం. పాము తరుముతూ ఉన్నట్టు కల వస్తే మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని, లేక వస్తుందని అర్థం.

గొర్రె

గొర్రె కలలో కన్పిస్తే మీలో ప్రయత్నలేమి,చొరవలేనితనానికి సూచన. అలాగే కొత్త మార్గాల్లో వెళ్ళటానికి మొగ్గు చూపరని అర్ధం. మీలో ఏ ప్రత్యేకత లేకుండా నలుగురిలో ఒకరిగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.