Beauty Tips

Face Glow Tips:కలబందతో ఇలా చేస్తే మీ ముఖంపై ఉన్న నలుపు మొత్తం మాయం

Face Glow Tips:కలబందతో ఇలా చేస్తే మీ ముఖంపై ఉన్న నలుపు మొత్తం.. చర్మానికి సంబందించిన సమస్యలను తగ్గించుకోవటానికి మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. దాని కోసం వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు.

ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది అందం మిద శ్రద్ద పెట్టటం చాల ఎక్కువ అయింది. ముఖం అందంగా మెరవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలంటే కోరుకుంటున్నారు.

ముఖం మీద మొటిమలు వచ్చిన చిన్న మచ్చలు వచ్చిన చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీమ్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా మెరిసే కాంతివంతమైన ముఖాన్ని పొందొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

అవన్నీ మనకు ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి. కాస్త ఓపిక చేసుకుని ఈ రెమిడిని ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు,అరస్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

పసుపులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-ట్యానింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మొటిమలు, టానింగ్, సన్‌బర్న్, ముడతలు వంటి చర్మ సమస్యలు తొలగిపోవడానికి సహాయపడుతుంది. పసుపును మార్కెట్ లో కొనకుండా… పసుపు కొమ్ములను తెచ్చుకొని మెత్తని పొడిగా చేసుకొని వాడితే మంచిది.

అలోవెరా ముడతలు, మొటిమలని నివారించడం ద్వారా చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలని తొలగిస్తుంది. దద్దుర్లు, మొటిమలు, గాయాలని నయం చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేయడంలో సహాయపడి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.