Kitchen

Tiles Cleaning Tips: వైట్‌ టైల్స్‌ ఎంత కాలం అయినా మిలమిల మెరవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి

Tiles Cleaning Tips: ఇంటిలో నేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా సరే దుమ్ము, ధూళి, తేమ కారణంగా టైల్స్ మధ్య మురికి చేరి శుభ్రం చేయటానికి కష్టమవుతుంది. ఎంత శుభ్రం చేసిన పెద్దగా ఫలితం కనిపించదు. ముఖ్యంగా తెల్లని టైల్స్ శుభ్రం చేయటం చాలా కష్టం అవుతుంది

అయితే టైల్స్ మధ్య చేరిన మురికిని తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అవ్వండి.

ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు, ఒక కప్పు వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేసి ఐదు నిమిషాల తర్వాత బ్రష్ తో రుద్దితే మురికి తొలగిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.

ఒక గిన్నెలో పావు కప్పు లిక్విడ్ బ్లీచ్, 3/4 కప్పు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టైల్స్ మధ్య రాసి 10 నిమిషాలు అయ్యాక పాత టూత్ బ్రష్ సాయంతో రుద్దితే మురికి మొత్తం తొలగిపోయి శుభ్రంగా తెల్లగా మెరిసిపోతుంది.

టైల్స్ మధ్య మురికి తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నీటిలో నిమ్మ రసాన్ని కలిపి మురికి ఉన్న చోట స్ప్రే చేయాలి. 10 నిమిషాల తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే మురికి తొలగిపోవటమే కాకుండా టైల్స్ మెరుస్తూ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."