Beauty Tips

Face Glow Tips:పసుపులో కలిపి రాస్తే ముఖం మీద నల్లని మచ్చలు మాయం

Turmeric And Milk Face Glow Tips in telugu:ముఖం మీద ఎటువంటి మచ్చలు,మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

పసుపును పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. పసుపులో యాంటీ బాక్టీరియల్,శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, కర్కుమిన్,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన చర్మానికి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

నిస్తేజంగా మారిన చర్మానికి మెరుపును అందిస్తుంది. అలాగే పసుపు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా మరియు తాజాగా ఉంచడంలో సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ పసుపు,సరిపడా పాలను వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి మెడకు రాసి 5 నిమిషాల తర్వాత నీటిని జల్లుతూ రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. శనగపిండిని కూడా పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. శనగపిండిలో ఉన్న పోషకాలు చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.