Kitchen

Tooth Paste Tips:టూత్‌ పేస్ట్‌తో పళ్లే కాదు.. వీటిని మెరిపించేయండి..అసలు మిస్ కావద్దు

Tooth Paste Cleaning Hacks: మనం ప్రతిరోజు టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటాం. టూత్ పేస్ట్ మన పళ్ళని తెల్లగా మెరిపించడానికి సహాయపడటమే కాకుండా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు టూత్ పేస్ట్ ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోతే మనం బయట పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే ఎన్నో రకాలుగా వాడవచ్చు.
Tooth Paste
వాష్ బేసిన్ శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. కొన్నిసార్లు వాష్ బేసిన్ ని ఎంత శుభ్రం చేసిన మురికి గానే ఉంటుంది. అలాంటప్పుడు పాత టూత్ బ్రష్ తీసుకుని దానికి టూత్ పేస్ట్ రాసి తడిపి సింక్ లోని అన్ని భాగాలకు అప్లై చేసి రుద్దాలి. ఈ విధంగా చేయడం వలన మురికి వదలటమే కాకుండా వాసన కూడా పోతుంది.
silver glass
వెండి వస్తువులను శుభ్రం చేయడం కూడా కాస్త కష్టమైన పని. టూత్ పేస్ట్ తో వెండి వస్తువులను చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. వెండి వస్తువులను తడిపి దానికి టూత్ పేస్ట్ రాసి బ్రష్ తో రుద్ది ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.

మొండి మరకలను తొలగించడానికి కూడా టూత్ పేస్ట్ సహాయపడుతుంది. గోడలపై గీసిన క్రేయాన్‌ గీతలు, రంగులు, ఆహార పదార్థాల మరకలపై కొంచెం టూత్ పేస్ట్ రాసి కొంచెం సేపు అయ్యాక తుడిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.