Devotional

Ayyappa Swamy Prasadam:“శబరిమల అయ్యప్ప” ప్రసాదం మీకు ఇష్టమా..? అయితే అరవణి ప్రసాదం గురించి ఈ 6 నిజాలు తప్పక తెలుసుకోండి!

Ayyappa Swamy Prasadam:అబ్బ, కార్తీక మాసం వచ్చేసింది..చలి దంచేస్తుంది.ఈ చలిలో కూడా చాలా నిష్టగా తెల్లవారుఝామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజకి కూర్చుంటారు కొందరు నల్లబట్టలతో..అదేనండి స్వాములు అంటాం.

మనం..అయ్యప్పమాల దీక్ష చేస్తూ 41రోజుల దీక్ష పూర్తి అయిన తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు..మనవాళ్లల్లో కూడా స్వాములు అలా వెళితే వాళ్లు క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడం తో పాటు వారు తెచ్చే ప్రసాదం కోసం కూడా చాలా ఎదురుచూస్తాం…పాకంలా నల్లగా  డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండి దాన్ని తింటుంటే అబ్బా చాలా టేస్టీగా ఉంటుంది కదా…చెప్తుంటేనే నోరూరుతుందా..ఆ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీకోసం…

  •  అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న స్వాములు తీసుకొచ్చే  అయ్యప్ప ప్రసాదం పేరు  అరవణి ప్రసాదం .
  • బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఈ ప్రసాదం తయారు చేస్తారు. అనేక పోషక పదార్ధాల మిలితం అయిన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  • చలికాలంలో అరవణి ప్రసాదం తింటే  శరీరంలో వేడిని కలిగిస్తుంది.
  • ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి.
  •  ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని కనీసం రెండు నుంచి పది లక్షల మండి దర్శించుకుంటారని అంచనా. భక్తుల కోసం ప్రతి ఏడాది 80 లక్షల అరవణ ప్రసాదాన్ని తయారు చేస్తారట.
  • తిరుమల తరువాత అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం.తిరుమల లడ్డు తర్వాత అరవణి  ప్రసాదానికి అంత పేరుంది.