Beauty Tips

Hair Mask:నిగనిగలాడే జుట్టు కోసం మాస్క్

Hair Mask: ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సమస్యలు వచ్చినపుడు ఇంటి చిట్కాలు చాలా బాగా సహ్యపడతాయి.

1. ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జు, టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అయిదు నిమిషాల పాటు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ బ్రష్ సహాయంతో తలకు పట్టించి అరగంట తరవాత షాంపూతో తల స్నానం చేయాలి. డ్రై హెయిర్ గల వారు 15 రోజులకి ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే నిర్జీవమైన జుట్టు నిగనిగలాడుతుంది.

2. హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

3. ఒక కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొనను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు మీకు సొంతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.