Devotional

Interesting Facts:బొటన వేలును బట్టి మీరు ఎలా ఉంటారో చెప్పవచ్చు….ఎలా ?

What the Thumb Reveals :ఒక్కొకరి వెళ్ళు ఒక్కో రకంగా ఉంటాయి. కొందరివి సన్నగా ఉంటాయి, కొందరివి లావుగా ఉంటాయి.. అలానే పొట్టిగా, పొడవుగా కూడా ఉంటాయి. ప్రపంచంలో ఏ ఒక్కరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. చేతి రాతలు బట్టి జాతకాలు చెబుతారు. వాటిని కొందరు నమ్ముతారు… కొందరు కొట్టి పారేస్తారు.

అలాగే చేతి బొటన వెల్లని బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట. కొందరి బొటనవేలు నిటారుగా ఉంటాయి… మరి కొందరిది కొద్దిగా వంగి ఉంటాయి. వీటిని బట్టి అ వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవచ్చట. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా చదివేయండి!

మీ బొటనవేలు కొద్దిగా వంగి ఉందంటే మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ముందుంటారని అర్ధం. ఆలోచనలను వ్యక్తపరచడంలో ఏమాత్రం మొహమాటపడరు. మీ మెదడు ఎల్లప్పుడూ చురుకుగా పనిచేస్తుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తారు. మంచి చమత్కారులు. మీ తోడుని ఇతరులు ఇష్టపడతారు.

మీ బొటనవేలు నిటారుగా ఉందంటే మీరు కోపిష్టి అని అర్ధం. ఇలాంటి వారికి తక్కువగా ఆకర్షితులవుతారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిఉంటారు. వీరి లిమిట్స్ వీరికి బాగా తెలుసు. ఎవరికీ ఎక్కువ చనువు ఇవ్వరు. వీలైనంతవరకు అనవసరమైన విషయాల్లో తల దూర్చరు. ఎదుటి వారిని సులభంగా అంచనా వేయగలరు. దుష్టులకు దూరంగా ఉండడంలో వీరు నెంబర్ 1.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.