Devotional

హిందూ ధర్మ శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కింద‌పెట్ట‌కూడని 5 వ‌స్తువులు ఇవే.!

హిందూ ధర్మ శాస్త్రం ప్ర‌కారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని క్రిందన కాని, అశుభ్రమైన ప్రదేశాలలో కాని, మంచం మీద కాని పెట్టము. పూజకు ఉపయోగించే పూలు, కొబ్బ‌రికాయ‌, అగ‌ర్‌బ‌త్తీలు, క‌ర్పూరం… లాంటి వ‌స్తువుల‌ను కింద పెట్ట‌ము,ఒకవేళ కింద పడితే వాటిని పూజకు ఉపయోగించము. వీటితో పాటు హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద‌పెట్ట‌కూడదు. అలా పెడితే అంతా అశుభ‌మే జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కం.ఇంతేకీ అస్సలు క్రింద పెట్టకూడని ఆ 5 వ‌స్తువులు ఏమిటో తెలుసుకుందాం…

జంధ్యం…
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధ‌రించే ఆచారం ఉంటుంది. జంధ్యాన్ని త‌ల్లిదండ్రులు, గురువుల‌కు ప్ర‌తి రూపంగా భావిస్తార‌ట‌. అందువలన జంధ్యంను కింద పెడితే వారిని అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌. అందుక‌ని దాన్ని ఎప్పుడూ నేల‌పై పెట్ట‌కూడ‌దు.

శివ‌లింగం, సాలిగ్రామం…
శివ‌లింగం అలాగే నేపాల్‌లోని గండ‌కీ న‌ది తీరంలో ఓ ర‌క‌మైన న‌ల్ల రాయి సాలిగ్రామంను ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు. సాలిగ్రామంను విష్ణువుకు ప్ర‌తిరూప‌మ‌ని చెబుతారు. వీటిని క్రిందన పెడితే అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌.
Deepam
దీపం…
దేవుడి ముందు పెట్టే దీపాల‌ను నేల‌పై పెట్ట‌రాదు. వాటిని వెలిగించినా, వేలించక పోయినా ఎల్ల‌ప్పుడూ వాటిని శుభ్ర‌మైన వ‌స్త్రంపై ఉంచాలి. నేల‌పై పెట్ట‌రాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవత‌ల‌ను అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌.
Gold Rate today In Telugu
బంగారం…
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే, లక్ష్మిదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు.
sankham
శంఖువు…
శంఖువులో సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి కొలువై ఉంటుంద‌ట‌. కాబ‌ట్టి దాన్ని కూడా నేల‌పై పెట్ట‌రాదు. పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు క‌లుగుతాయ‌ట‌.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."